NLG: ప్రమాదంలో మరణించిన హమాలీ లకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: ఏర్పుల యాదయ్య
ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె లో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య కార్మికులను కోరారు. మర్రిగూడ మండలం శివన్నగూడెం లో యాదయ్య మాట్లాడుతూ.. 50 సం.లు వయసు పైబడిన హమాలీ లకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన హమాలీ లకు 10 లక్షల నష్టపరిహారం సహజ మరణానికి 5 లక్షల ఇవ్వాలని వారి పిల్లల చదువులకు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అట్లాగే హమాలీ లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు బిజెపి పాలన వల్ల ఎన్నో ఇబ్బందులతో పోరాడుతున్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26,000/- అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనికి వెళ్లే కూలీలకు 200 రోజులు పని కల్పించాలని రోజువారి కూలీ 600 రూపాయలు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అప్పనగోని యాదయ్య, మేడ ప్రకాష్, పానకత్తుల వెంకటయ్య, మానుపాటి యాదయ్య, ఒట్టుకోటి నరసింహ, ఏర్పుల సావిత్రి, గుణగోని సోమయ్య, తదితరులు పాల్గొన్నారు
Feb 04 2024, 14:19