NLG: భారత రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరుడు తెలుసుకోవాలి: బుర్రి వెంకన్న
పిఏపల్లి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి సన్మానించారు. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ డైరీని ఆయనకు బహుకరణ చేశారు. తహసిల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ క్రాంతి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు. అనంతరం మండల వ్యాప్తంగా పౌర హక్కుల దినాన్ని నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తారతమ్యాలను తగ్గించడం కోసం సమావేశాలు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ బుర్రి వెంకన్న పాల్గొని మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధన కోసం, భారత రాజ్యాంగ హక్కులను ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా అందేవిధంగా, సామాజిక చట్టబద్ధమైన పోరాటానికి శ్రీకారం చుట్టడం కోసం గ్రామాలకు, మండలాలకు, జిల్లా స్థాయిలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంఘాన్ని విస్తృతం చేయడం కోసం ముందుకు రావాలని యువతీ యువకులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధర్మపురం శ్రీను, ఆడెపు సతీష్, మండల సభ్యులు జిల్లా రాములు, రవణంపల్లి వెంకటయ్య, ఎర్ర రవి ఆడెపు భరత్ తదితరులు పాల్గొన్నారు.
Feb 03 2024, 13:10