NLG: చింతపల్లి సిడిపిఓ కు సమ్మె నోటీసు ఇచ్చిన సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నల్లగొండ జిల్లా, చింతపల్లి:
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16 జరుగనున్న కార్మికుల సమ్మె అంగన్వాడి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చింతపల్లి సిడిపిఓ లావణ్య కు సమ్మె నోటీసు ను శుక్రవారం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగా కార్మిక వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించలేదు, అట్లాగే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు హామీ విస్మరించింది, ఉద్యోగ కల్పన పడిపోయింది, నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట సాయికి చేరింది, శ్రామికుల నిజ వేతనాలు 20% తగ్గిపోయి ధరలు నియంత్రిస్తామని చేసిన వాగ్దానం అమలు కాకపోగా నిత్యవసర ధరలు కనివిని ఎరుగని రీతిలో పెరిగాయని ఆయన అన్నారు.
అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారు. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికారు. ప్రతి కార్మికునికి కనీస వేతనం నెలకు రూ. 26,000 నిర్ణయించేందుకు అంగీకరించడం లేదు. అట్లాగే సమ్మే హక్కులను కాల రాస్తుందన్నారు. వివిధ రంగాల్లో వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తుంది.
అట్లాగే పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 గంటలు పని విధాన్ని అమల్లోకి తెస్తున్నారు. కాంట్రాక్ట్ లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమదోపిడికి గురిచేస్తున్నారు. అట్లాగే వ్యవసాయ కూలీలకు జీవనాధారంగా ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బడ్జెట్ తగ్గిస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రతికూలికి 200 రోజులు పని కల్పించాలని, రోజువారి వేతనం 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో సుమారు కోటి మంది పనిచేస్తున్న కేంద్ర స్కీమ్ లకు ప్రభుత్వం నిధుల్లో కోత పెడుతున్నారని విమర్శించారు.
అందుకోసం దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు వ్యవసాయ కూలీలు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏర్పుల యాదయ్య అన్నారు
Feb 03 2024, 12:00