NLG: ప్రభుత్వ జేబీఎస్ హైస్కూల్ లో విద్యార్థులకు శారీరకదారుఢ్య కార్యక్రమాలు
నల్గొండ పట్టణంలోని మాధవ్ నగర్ జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు
బొమ్మపాల గిరిబాబు సారథ్యంలో, విద్యార్థుల కొరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు విద్యార్థుల్లో శారీరక ఆరోగ్యం, శారీరక ఎదుగుదల, మానసిక పరిపక్వత కొరకు ప్రతిరోజు స్వచ్ఛందంగా వ్యాయామ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఈరోజు ప్రత్యేకంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్ క్రీడాకారులు మరియు జే బీఎస్ పాఠశాల విద్యార్థులు తో కలిపి వివిధ రకాల శారీరకదారుఢ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం ముందరనే విద్యార్థులు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అద్భుతమైన శారీరక, మానసిక పరిపక్వత సాధించవచ్చునని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, దాదాపు 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Feb 01 2024, 19:14