/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో చేరుటకు గడువు తేదీ పొడిగింపు Mane Praveen
NLG: ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో చేరుటకు గడువు తేదీ పొడిగింపు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరుటకు గడువు తేదీని పొడిగించడం జరిగింది. ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. కావున విద్యార్థులు, విద్యార్థినిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజా రామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు సైబర్ క్రైమ్ పై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. 

నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగార్జున, నల్గొండ టూ టౌన్ ఎస్సై నాగరాజు సహకారంతో కళాశాల విద్యార్థిని లకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. 

వారు మాట్లాడుతూ.. ఈ మధ్య సోషల్ మీడియా, ఫేస్బుక్ మరియు వాట్సాప్ లలో జరుగుతున్న వివిధ రకాలైన నేరాల పై అవగాహన పెంచుకోవాలని, వాటిని అధిగమించాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్లు ఐతే స్పందించ కూడదని, వాట్సప్ మిగతా సోషల్ మీడియా సైట్లకు టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులకు సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించిన సలహాలు వివరంగా తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఘన్ శ్యామ్, వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు మంజుల, సుంకరి రాజారామ్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ జ్యోతి, శైలజ, సరిత, వనజ తదితరులు పాల్గొన్నారు.

TS: నంది అవార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

సినీ కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన నంది అవార్డుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

కళారంగంలో ప్రముఖ ప్రజా కవి గద్దర్ చేసిన సేవలకు గుర్తింపుగా.. ఇకనుంచి తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల పేరును గద్దర్ పేరు మీదగా ఇస్తామని కీలక ప్రకటన చేశారు.

హైదారాబాద్ లో రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

TS: ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం తెలంగాణ విప్లవకారుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలను తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు డాక్టర్. రేష్మ హుస్సేన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఒక విప్లవ కారుని కోల్పోయిందని అటువంటి ప్రజా గాయకుడు నేడు మన రాష్ట్రంలో లేకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆయన పాడిన పాటలు, విప్లవ గీతాలు ఎన్నటికీ మరువలేని స్మృతులని ఆమె బాధతృప్త హృదయముతో ఆవేదన వ్యక్తపరిచారు. ఆయన చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ట్యాంకుబండ్ పై  విగ్రహాన్ని నిర్మిస్తానని అనడం సంతోషకరమైనటువంటి విషయమని ఆమె అన్నారు.

అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన జయంతిని జరుపుతామని తెలపడం తెలంగాణ రాష్ట్రం గర్వించదగిన విషయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

TS: గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో.. తప్పులున్న వాటిని నిలిపివేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీకి అప్పగించినట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికకు సీఈసీ కమిటీని నియమించినట్టు వివరించారు..

అభ్యర్థులు అప్లపికేషన్లను గాంధీ భవన్‌లోనే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు మరో 100 రోజులు ఉందని.. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి.. ప్రచారానికి సమరశంఖం మోగిస్తున్నటు ప్రకటించారు..

గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని జీవోల్లో తప్పులున్న జీవోలను నిలిపివేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటిపై విచారణ సంస్థలు విచారణ చేపట్టాయని... ప్రజాస్వామ్యయుతంగా పద్దతిగా ప్రాసెస్ జరుగుతుందని జరిగిన తప్పులను ఇన్వెస్టిగేటీవ్ ఏజెన్సీలు తేల్చుతాయన్నారు. గత ప్రభుత్వంలో తప్పులున్న జీవీలోను తమ ప్రభుత్వం దృష్టికి వచ్చిన జీవోలను వెంటనే నిలిపేస్తున్నామని స్పష్టం చేశారు.

TS మల్లు రవి ని మర్యాదపూర్వకంగా కలిసిన మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవిని, గాంధీభవన్ లో మంగళవారం, తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె 2012 తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో ఆమెకు బుల్లెట్ గాయాలైన విషయాలు ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అదేవిధంగా డాక్టర్ రేష్మ హుస్సేన్ విద్యా నేపథ్యాన్ని అడిగి తెలుసుకుని ఉన్నత విద్యలు చదివిన ఆమెను అభినందించారు.

TS: కొరత లేకుండా తెలంగాణ లో నిరంతర విద్యుత్తు: ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణ లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా పై త‌ప్పుడు ప్ర‌చారం మానుకోకుంటే, బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్ర‌జ‌లే బుద్ది చెప్తారని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్ర‌మార్క‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన కొంత మంది సోషల్ మీడియా వీరులు, కరెంటు స‌ర‌ఫ‌రాపై తప్పుడు ప్రచారం చేస్తూ.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.

తెలంగాణ ప్రజలకు నాణ్య‌మైన విద్యుత్తు తో పాటు ఎటువంటి కోత‌లు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా జరుగుతుందని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇందిర‌మ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వమ‌ని, ప్రజల కలలు నిజం చేయడమే తమ ధ్యేయమ‌న్నారు.

ఫేక్‌ లీడర్స్, సోషల్‌ మీడియా లీడర్స్‌ తెలంగాణలో విద్యుత్తు కోత‌లు ఉంటే బాగుంటుందని కలలు కంటున్నారని, వారి కలలు వికృతి కలలని, అటువంటి వారికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారనన్నారు.

తెలంగాణలో విద్యుత్ సరఫరా గత సంవత్సరంతో పోలిస్తే 2023 డిసెంబర్ 07 నుండి గణనీయంగా మెరుగుపడిందని వివ‌రించారు.

2023 డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ప్రతి రోజు సగటున 207.7 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామ‌ని, 2022 డిసెంబర్ లో సగటున 200 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశార‌ని తెలిపారు.

NLG: 'అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరుటకు రేపే చివరి అవకాశం'

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ లో చేరాలనుకునే వారికి రేపు చివరి అవకాశం కలదు. ఇందులో భాగంగా రెగ్యులర్ ఇంటర్, ఓపెన్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ ఐటిఐ రెండు సంవత్సరాల డిప్లమా పూర్తి చేసిన వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మూడు సంవత్సరాల డిగ్రీలో చేరుటకు అర్హులు.

ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరుటకు రేపు చివరి అవకాశం కలదు. మహిళలకు ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండలో ప్రత్యేక స్టడీ సెంటర్ కలదు. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్ రాజారామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏఐఎస్ఎస్డి ఇంచార్జ్ గా బుర్రి వెంకన్న.

ఆల్ ఇండియా సమత సైనిక దళ్, ఉమ్మడి నల్గొండ జిల్లాల ఇన్చార్జిగా ఆల్ ఇండియా సమతా సైనిక్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న ను నియమిస్తూ, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య నిన్న హైదరాబాదులో నియామక పత్రాన్ని అందజేశారు.

నియామక పత్రం అందుకున్న బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ సంస్థలో పనిచేయడం చాలా అదృష్టమని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఈ సంస్థలో పనిచేయాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని ఆయన అన్నారు.

తనకు ఇచ్చిన బాధ్యతను జిల్లా స్థాయిలో పూర్తిగా కమిటీలు వేసి సంఘం బలోపేతానికి కృషి చేస్తానని, ఈ బాధ్యతను తనకు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.

TS: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వారి నివాసంలో.. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు సోమవారం ఎమ్మెల్యే వెంకటస్వామి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలిండియా సమతా సైనిక్ దళ్ నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎస్డి రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దశరథ్, ఉపాధ్యక్షులు నర్సింగరాజ్, వైద్యనాథ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, కృష్ణ, మద్దిలేటి, ఆర్గనైజింగ్ సెక్రటరి, అమ్మదాస్, మధు, తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్ చేత స్థాపించబడిన ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.