/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: కొరత లేకుండా తెలంగాణ లో నిరంతర విద్యుత్తు: ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క Mane Praveen
TS: కొరత లేకుండా తెలంగాణ లో నిరంతర విద్యుత్తు: ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణ లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా పై త‌ప్పుడు ప్ర‌చారం మానుకోకుంటే, బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్ర‌జ‌లే బుద్ది చెప్తారని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్ర‌మార్క‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన కొంత మంది సోషల్ మీడియా వీరులు, కరెంటు స‌ర‌ఫ‌రాపై తప్పుడు ప్రచారం చేస్తూ.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.

తెలంగాణ ప్రజలకు నాణ్య‌మైన విద్యుత్తు తో పాటు ఎటువంటి కోత‌లు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా జరుగుతుందని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇందిర‌మ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వమ‌ని, ప్రజల కలలు నిజం చేయడమే తమ ధ్యేయమ‌న్నారు.

ఫేక్‌ లీడర్స్, సోషల్‌ మీడియా లీడర్స్‌ తెలంగాణలో విద్యుత్తు కోత‌లు ఉంటే బాగుంటుందని కలలు కంటున్నారని, వారి కలలు వికృతి కలలని, అటువంటి వారికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారనన్నారు.

తెలంగాణలో విద్యుత్ సరఫరా గత సంవత్సరంతో పోలిస్తే 2023 డిసెంబర్ 07 నుండి గణనీయంగా మెరుగుపడిందని వివ‌రించారు.

2023 డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ప్రతి రోజు సగటున 207.7 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామ‌ని, 2022 డిసెంబర్ లో సగటున 200 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశార‌ని తెలిపారు.

NLG: 'అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరుటకు రేపే చివరి అవకాశం'

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ లో చేరాలనుకునే వారికి రేపు చివరి అవకాశం కలదు. ఇందులో భాగంగా రెగ్యులర్ ఇంటర్, ఓపెన్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ ఐటిఐ రెండు సంవత్సరాల డిప్లమా పూర్తి చేసిన వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మూడు సంవత్సరాల డిగ్రీలో చేరుటకు అర్హులు.

ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరుటకు రేపు చివరి అవకాశం కలదు. మహిళలకు ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండలో ప్రత్యేక స్టడీ సెంటర్ కలదు. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్ రాజారామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏఐఎస్ఎస్డి ఇంచార్జ్ గా బుర్రి వెంకన్న.

ఆల్ ఇండియా సమత సైనిక దళ్, ఉమ్మడి నల్గొండ జిల్లాల ఇన్చార్జిగా ఆల్ ఇండియా సమతా సైనిక్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న ను నియమిస్తూ, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య నిన్న హైదరాబాదులో నియామక పత్రాన్ని అందజేశారు.

నియామక పత్రం అందుకున్న బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ సంస్థలో పనిచేయడం చాలా అదృష్టమని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఈ సంస్థలో పనిచేయాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని ఆయన అన్నారు.

తనకు ఇచ్చిన బాధ్యతను జిల్లా స్థాయిలో పూర్తిగా కమిటీలు వేసి సంఘం బలోపేతానికి కృషి చేస్తానని, ఈ బాధ్యతను తనకు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.

TS: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వారి నివాసంలో.. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు సోమవారం ఎమ్మెల్యే వెంకటస్వామి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలిండియా సమతా సైనిక్ దళ్ నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎస్డి రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దశరథ్, ఉపాధ్యక్షులు నర్సింగరాజ్, వైద్యనాథ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, కృష్ణ, మద్దిలేటి, ఆర్గనైజింగ్ సెక్రటరి, అమ్మదాస్, మధు, తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్ చేత స్థాపించబడిన ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.

NLG: ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ హరి చందన

నల్లగొండ: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ ఆర్టీలను సమర్పించారు. ఆర్థిలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పండ్ల మొక్కలు నాటిన అధ్యాపకులు

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం కొన్ని రకాల పండ్ల చెట్లను కళాశాల అధ్యాపకులు నాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. కళాశాలలో కొన్ని రకాలైన పండ్ల చెట్లను నాటడం జరిగిందని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని తెలిపారు. 

గతంలో కళాశాలలో ఉడుతలు గాని పక్షులు గాని కనిపించకుండా ఉండేది. ఈ మధ్య కాలంలో కళాశాలలో పిచ్చుకలకు, ఉడుతలకు ఆహార పదార్థాలు తినేందుకు, నీరు తాగేటందుకు వీలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతరించిపోతున్న పిచ్చుకల జాతిని మనము ఈ విధంగా కాపాడుకోవచ్చని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు రవిచంద్ర, డాక్టర్ రాజారామ్, కళాశాల సూపరింటెండెంట్ జ్యోతి, రమేష్, యాదగిరి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

NLG: ఆర్పి పట్నాయక్ చేతులమీదుగా సేవారత్న పురస్కారం అందుకున్న కురిమేటి నవీన్

మిర్యాలగూడ: జనయేత్రి ఫౌండేషన్ మిర్యాలగూడ వారిచే తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ వ్యవస్థపాక అధ్యక్షులు డాక్టర్ కురిమేటి నవీన్ ను వారి సేవలను గుర్తించి ఆయనకు సేవ రత్న ప్రశంసా పత్రాన్ని ఆదివారం సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ అందజేశారు.

ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ.. దాదాపు 5 సం. లుగా 200 పైగా ప్రోగ్రాంలు చేసి, 6000 మందికి పైగా అవసరం ఉన్న వారికి తన మిత్రులతో కలసి రక్త దానం అందిచటం, స్వయంగా 33 సార్లు రక్త దానం చేయటం, ఉచిత అంబులెన్సు పెట్టి 200 మంది పైగా ప్రాణాలు కాపాడటం, అనాధ, వృద్ధులు, మహిళలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంచటం లాంటివి సమాజ సేవ కార్యక్రమాలను గుర్తించి వారిని అభినదించటం జరిగింది అన్నారు.

నవీన్ విలేకరులతో మాట్లాడుతూ.. పే బ్యాక్ సొసైటీ అనే నినాదం తో ఏర్పడ్డ ఈ సంస్థ ఎంతో మంది అనాధ, వృద్ధులు, మహిళలకి సహాయం చేయటం, ఉచిత అంబులెన్స్ సేవలు అందించడం వంటివి చేశామని, అలానే ఇంటినే గ్రంధాలయంగా మార్చి 30కి పైగా పిల్లలకు రోజు చదువు చెప్పడం, నా ఒకరితో మొదలైన ఈ సంస్థ కొన్ని వందల మందికి సహాయం చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ అవార్డ్ అంకితం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డాక్టర్ సంపత్ కుమార్ వరల్డ్ రికార్డ్ రక్త దాత 294, సమాజ సేవకురాలు కర్నే శిరీష ( బరెలక్క), కుమారి దుర్గా లావణ్య పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్ 2020, డాక్టర్ సకీజ ఖాన్, జనయేత్రి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మున్నీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

NLG: అథ్లెటిక్ జిల్లాస్థాయి సెలక్షన్ లలో ప్రథమ స్థానం పొందిన బొమ్మపాల సాయి శివ, జాకటి చరణ్ ప్రీత్

నల్గొండ: పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ సెలక్షన్లలో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన క్రీడాకారులు.. అండర్ 10 విభాగంలో బొమ్మపాల సాయి శివ, మరియు అండర్ 12 విభాగంలో జాకటి చరణ్ ప్రీత్ లు ఇద్దరూ ప్రథమ స్థానం పొందారని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

ఈ ఇద్దరు క్రీడాకారులు గత 2 సంవత్సరాల నుండి క్లబ్ ఫుట్బాల్ కోచ్ మద్ది కర్ణాకర్ శిక్షణలో ఫుట్బాల్ క్రీడ తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ విభాగంలో నిరంతరం సాధన చేస్తూ ప్రొఫెషనల్ క్రీడాకారులు గా తయారవుతున్నారని తెలిపారు.

NLG: రేపటి భవిష్య భారత్ కు మోదీ నాయకత్వం కావాలి: బూర నర్సయ్య గౌడ్

నల్లగొండ జిల్లా: 

చిట్యాల మండలం, నేరేడ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ, కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, యూత్ ఐకాన్ నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, రేపటి భవిష్య భారత్ కు మోదీ నాయకత్వం కావాలని, బంగారు భవిష్యత్ కు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి దేశ అభివృధికి తోడ్పడుదాం అన్నారు.

NLG: కష్టజీవుల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులు: నెల్లికంటి సత్యం

కష్టజీవుల కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు చేసేది కమ్యూనిస్టులేనని, వారి పక్షాన పేద ప్రజలు నిలబడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కోరారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో జరిగిన మునుగోడు పట్టణ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసింగించారు. 

పాలకులు ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి రంగాలను మెరుగుపరచకుండా ఎన్నికల్లో ప్రలోభాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఎస్ ఎల్ బి సి అంతర్భాగంలోని దిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని అన్నారు.  

వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిని రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల నిషేధాన్ని సిపిఐ స్వాగతిస్తూ. ఆ పోరాటంలో సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కోరారు. మునుగోడు పట్టణంలోని పేదలకు ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణాల కోసం ఐదు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకాన్ని అమలు పరచాలని కోరారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు,పెన్షన్లు, తదితర సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, పట్టణ కేంద్రంలో సులబ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సమావేశానికి రేవెల్లి అంజయ్య అధ్యక్షత వహించగా, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి. వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శ్రీను, మండల కార్యవర్గ సభ్యులు దుబ్బ వెంకన్న, ఎం.డి జానీ, బెల్లం శివయ్య, పట్టణ కార్యదర్శి కురుమర్తి ముత్తయ్య, చాపల విప్లవ్, ఎల్ల స్వామి, సైదులు, లక్ష్మయ్య, అండాలు, ప్రేమలత, రేణుక, దీప్తి, కలమ్మ, సరిత, తదితరులు పాల్గొన్నారు.