NLG: ఆర్పి పట్నాయక్ చేతులమీదుగా సేవారత్న పురస్కారం అందుకున్న కురిమేటి నవీన్
మిర్యాలగూడ: జనయేత్రి ఫౌండేషన్ మిర్యాలగూడ వారిచే తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ వ్యవస్థపాక అధ్యక్షులు డాక్టర్ కురిమేటి నవీన్ ను వారి సేవలను గుర్తించి ఆయనకు సేవ రత్న ప్రశంసా పత్రాన్ని ఆదివారం సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ అందజేశారు.
ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ.. దాదాపు 5 సం. లుగా 200 పైగా ప్రోగ్రాంలు చేసి, 6000 మందికి పైగా అవసరం ఉన్న వారికి తన మిత్రులతో కలసి రక్త దానం అందిచటం, స్వయంగా 33 సార్లు రక్త దానం చేయటం, ఉచిత అంబులెన్సు పెట్టి 200 మంది పైగా ప్రాణాలు కాపాడటం, అనాధ, వృద్ధులు, మహిళలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంచటం లాంటివి సమాజ సేవ కార్యక్రమాలను గుర్తించి వారిని అభినదించటం జరిగింది అన్నారు.
నవీన్ విలేకరులతో మాట్లాడుతూ.. పే బ్యాక్ సొసైటీ అనే నినాదం తో ఏర్పడ్డ ఈ సంస్థ ఎంతో మంది అనాధ, వృద్ధులు, మహిళలకి సహాయం చేయటం, ఉచిత అంబులెన్స్ సేవలు అందించడం వంటివి చేశామని, అలానే ఇంటినే గ్రంధాలయంగా మార్చి 30కి పైగా పిల్లలకు రోజు చదువు చెప్పడం, నా ఒకరితో మొదలైన ఈ సంస్థ కొన్ని వందల మందికి సహాయం చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ అవార్డ్ అంకితం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డాక్టర్ సంపత్ కుమార్ వరల్డ్ రికార్డ్ రక్త దాత 294, సమాజ సేవకురాలు కర్నే శిరీష ( బరెలక్క), కుమారి దుర్గా లావణ్య పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్ 2020, డాక్టర్ సకీజ ఖాన్, జనయేత్రి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మున్నీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Jan 30 2024, 00:18