NLG: కష్టజీవుల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులు: నెల్లికంటి సత్యం
కష్టజీవుల కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు చేసేది కమ్యూనిస్టులేనని, వారి పక్షాన పేద ప్రజలు నిలబడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కోరారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో జరిగిన మునుగోడు పట్టణ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసింగించారు.
పాలకులు ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి రంగాలను మెరుగుపరచకుండా ఎన్నికల్లో ప్రలోభాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఎస్ ఎల్ బి సి అంతర్భాగంలోని దిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని అన్నారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిని రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల నిషేధాన్ని సిపిఐ స్వాగతిస్తూ. ఆ పోరాటంలో సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కోరారు. మునుగోడు పట్టణంలోని పేదలకు ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణాల కోసం ఐదు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకాన్ని అమలు పరచాలని కోరారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు,పెన్షన్లు, తదితర సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, పట్టణ కేంద్రంలో సులబ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సమావేశానికి రేవెల్లి అంజయ్య అధ్యక్షత వహించగా, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి. వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శ్రీను, మండల కార్యవర్గ సభ్యులు దుబ్బ వెంకన్న, ఎం.డి జానీ, బెల్లం శివయ్య, పట్టణ కార్యదర్శి కురుమర్తి ముత్తయ్య, చాపల విప్లవ్, ఎల్ల స్వామి, సైదులు, లక్ష్మయ్య, అండాలు, ప్రేమలత, రేణుక, దీప్తి, కలమ్మ, సరిత, తదితరులు పాల్గొన్నారు.
Jan 28 2024, 21:45