NLG: దేశవ్యాప్త కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్ బంద్ కు సిద్ధం కావాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా:
చండూరు: కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేటు అనుకూల విధానాలు, మతతత్వ విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న కార్మికుల సమ్మె - గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం లు పిలుపునిచ్చారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య అధ్యక్షతన జరిగిన మునుగోడు నియోజక వర్గ స్థాయి విస్తృత సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నా, రైతులు కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అవినీతి నల్లధనాన్ని తెచ్చి ప్రజలకు 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తామని మాటలు నీటి మూటలు గానే మిగిలాయని అన్నారు. భారతదేశంలోని సహజ వనరులన్నీ కార్పొరేట్ శక్తుల పరం చేస్తుంది. వ్యూహాత్మకంగా ప్రభుత్వ రంగ సంస్థలలో వందశాతం అమ్మకాల పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని ఆరోపించారు.12 గంటల పని విధానం అమల్లోకి తెస్తుంది, కాంట్రాక్టు విధానం తీసుకువచ్చి కార్మికులను మరింత దోపిడీకి గురిచేస్తుంది. కనీస వేతనం 26వేలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదని ఆరోపించారు. కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ఫిబ్రవరి 16 దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్ బంద్ జయప్రదం కోసం దశలవారీగా కార్యక్రమాలలో భాగంగా జనవరి 26న జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించాలని, 27 నుండి 30 వరకు అన్ని యూనియన్ల జనరల్ బాడీ లు నిర్వహించి యజమానులకు ప్రభుత్వ అధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలని అన్నారు. ఫిబ్రవరి 16 సమ్మె జయ ప్రధానికి ఇంటింటికి కరపత్రాలు, ప్రజలతో సంతకాల సేకరణ గ్రామ మండల స్థాయిలో రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులతో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో ప్రజానాట్య మండల జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి,సిఐటియు నాయకులు వరికుప్పల ముత్యాలు,జెర్రిపోతుల ధనంజయ్, మోగుదాల వెంకటేశం, కక్కునూరి నగేష్, వివిధ యూనియన్ల నాయకులు రమావత్ కవిత, అన్నే పర్తి వెంకన్న, కత్తుల సైదులు, పాశం లింగయ్య, లింగస్వామి,ముంత వెంకటేశ్వర్లు, మరియమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Jan 28 2024, 12:25