మంత్రి సీతక్కను కలిసిన కామారెడ్డి జిల్లా గ్రామ సర్పంచ్ లు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ సర్పంచులు మంత్రి సీతక్కను కలిసి వారి బాధలను తెలిపారు. తమ పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచులు మంత్రికి విజ్ఞప్తి చేశారు
గత ప్రభుత్వంలో సర్పంచులకు జరిగిన ఇబ్బందుల గురించి చర్చించడం జరిగింది. అలాగే కరోనా సమయంలో గ్రామపంచాయతీలకు అభివృద్ధి పనులు అందించ లేకపోయాము. గ్రామాభి వృద్ధిలో ప్రజల మన్ననలు పొందలేకపో యామన్నారు
గ్రామపంచాయతీ అభివృద్ధి చేసినటువంటి బిల్లులు ఇప్పటివరకు కూడా చెల్లింపులు జరగలేదని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు
ప్రభుత్వం ఇప్పటికైనా సర్పంచుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని పదవీ కాలం పొడిగించాలని మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి సర్పంచుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామన్నారు
మంత్రి సీతక్క హామీతో సర్పంచ్ లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రఫిక్, మాజీ ఎంపీటీసీ పతివద్దీన్, మాలోత్ తండా సర్పంచ్ సునీత ప్రకాష్ నాయక్, నడిమి తండా సర్పంచ్ వినోద్ కుమార్ పాల్గొన్నారు
Jan 27 2024, 20:42