NLG: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 29 చలో కలెక్టరేట్: SFI
నల్లగొండ జిల్లా
దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, నల్లగొండ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం SFI జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా SFI రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా SC,ST,BC సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈనెల 29చలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిందని తెలిపారు.
జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ లో వుండే SC,ST,BC సంక్షేమ వసతి గృహాల్లో వుంటు చదువుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం గత సంవత్సరం మార్చి నుంచి విద్యా సంవత్సరం 2023 - 2024 జనవరి వరకు ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా వుండడం వల్ల సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదని అన్నారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి గత సంవత్సరం బకాయి లో వున్న మెస్ చార్జీలు, స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ రమావత్ లక్ష్మణ్,బుడిగ వేంకటేష్, కుర్ర సైదా నాయక్, కోరె రమేష్, రవీందర్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
Jan 26 2024, 17:57