NLG: 'గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి'
దేవరకొండ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మరియు రాజ్యాంగ ప్రతిని తప్పకుండా ఉంచి జాతీయ జెండా ఎగర వేయాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఆర్డిఓ ఆఫీస్ లో మెమోరండం సమర్పించారు
1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు ను పురస్కరించుకొని స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఆరోజును మనం ప్రతి ఏటా భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని బుర్రి వెంకన్న అన్నారు.
కావున జనవరి 26 న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మరియు రాజ్యాంగ ప్రతిని తప్పకుండా ఉంచి జాతీయ జెండా ఎగరేయాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, రాములు, రాజ్ కుమార్, పెద్దయ్య, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
Jan 25 2024, 20:11