/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz SRPT: మద్యం బాటిళ్లు సీజ్, కేసులు నమోదు Mane Praveen
SRPT: మద్యం బాటిళ్లు సీజ్, కేసులు నమోదు

సూర్యాపేట: సిసిఎస్, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సూర్యాపేట రూరల్, పట్టణం, చివ్వెంల పోలీసు స్టేషన్ ల పరిధిలో జాతీయ రహదారి వెంట ఉన్న దాబా హోటల్స్, కిరణాలు పై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఆకస్మికంగా రైడ్స్ నిర్వహించారు. మద్యం అమ్మకాలు, అక్రమ సిట్టింగులు, అసాంఘిక కార్యకలాపాల పూర్తి సమాచారం మేరకు 21 దాబా హోటల్స్ పై తనిఖీలు నిర్వహించి మద్యం బాటిళ్లు సీజ్ చేసి, 11 దాబాల పై కేసుల నమోదు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

జాతీయ రహదారి పై అసాంఘిక చర్యలను అదుపు చేయడం, రోడ్డు వెంట భద్రత కల్పించడం, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా చర్యలు తీసుకున్నట్లు, రైడ్ నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

NLG: ముళ్ళ పొదల్లో పసి బాలుడు.. అక్కున చేర్చుకున్న స్థానికులు

నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి:

నవ మాసాలు మోసిన ఓ తల్లి మానవత్వాన్ని మరిచిపోయి పేగు తెంచుకుని పుట్టిన పసికందును ముళ్ళ పొదల్లో వదిలేసింది. ఈ ఘటన కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది. ముళ్ళ పొదల్లో కనిపించిన మగ శిశువును స్థానికులు వెంటనే అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటారు. స్థానిక అంగన్వాడి టీచర్ కు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ అధికారులు వెంటనే దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. 

NLG: లెంకలపల్లి లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేడు లెంకలపల్లి గ్రామంలో సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు అయిన 'ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్' కు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం, మండల నాయకులు రాందాస్ శ్రీనివాస్, పాల్వాయి అనిల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, దీపికా రెడ్డి, అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బాలికల దినోత్సవం

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలను పుట్టనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం.. అని ప్రతిజ్ఞ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాపోలు యాదగిరి మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అన్నారు. వారికి సరి అయిన పోషకాహారాన్ని అందించాలని, విద్యను అందించాలని, 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే బాలికలకు వివాహం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వెంకటేష్ యాదయ్య శ్యామల అపర్ణ స్వర్ణలత జానకమ్మ, అంగన్వాడీ టీచర్ చాపల పద్మ, ఆరోగ్య కార్యకర్తలు ఏర్పుల పద్మ, సైదాబీ, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి అంగన్వాడి కేంద్రంలో ఘనంగా బాలికల దినోత్సవం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ చాపల పద్మ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆడపిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించి, చదువుని అందించి వారి ఎదుగుదలకు తోడ్పడేలా చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మండల ఎమ్ ఎల్ హెచ్ పీ గోపీనాథ్, ఏఎన్ఎం జ్యోతి, ఆరోగ్య కార్యకర్తలు సైదాబీ, ఏర్పుల పద్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

TS: భూమి సునీల్ కుమార్ ను కలిసిన ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు

నల్లగొండ: ఆల్ ఇండియా బంజారా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో రాష్ట్ర ధరణి కమిటీ సభ్యులు భూమి సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వారికి తలపాగా చుట్టి, శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ధరణి కమిటీ సభ్యులుగా వారు ఎంపికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భూమి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి ఇటీవల ధరణి కమిటీ ఏర్పడిందని, సమస్యల పరిష్కారానికి భూ సమస్యలను అధ్యయనం చేసి ఈ కమిటీ మార్గం చూస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్ మాట్లాడుతూ.. భూ చట్టాల న్యాయ నిపుణులు ఎం.సునీల్ కుమార్ నల్సార్ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ, పేదల కోసం భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించారని, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వంలో ధరణి సమస్యల పరిష్కారానికి ఏర్పడిన ధరణి కమిటీ సభ్యులుగా భూమి సునీల్ కుమార్ కొనసాగుతున్నారని వారిని సత్కరించడం తమకు ఆనందకరమైన విషయమని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షులు రిటైర్డ్ ఆర్డీవో ప్రవీణ్ నాయక్,నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్, నరసింహ నాయక్, నాగార్జున నాయక్ పాల్గొన్నారు.

NLG: కొండమల్లేపల్లి గురుకుల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని తల్లిదండ్రుల సంఘం వినతి

నల్లగొండ జిల్లా: రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం, స్టూడెంట్ యూనియన్, స్కూల్ పేరెంట్స్ నాయకులు మంగళవారం రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రెటరీ నవీన్ నికోలస్ ను హైదరాబాద్లో కలిసి.. కొండమల్లేపల్లి గురుకుల విద్యార్దిని భార్గవి మృతి చెందిన ఘటనను, పాఠశాలలోని 640 మంది పిల్లలు ఎదుర్కునే ఇబ్బందుల గురించి వివరించి మెమొరాండం ఇచ్చారు. స్పందించిన గురుకులాల సెక్రెటరీ సంబంధిత ప్రిన్సిపాల్ కు నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు చేపట్టి సస్పెండ్ చేస్తామని రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం కు తెలిపినట్లు సంఘ సభ్యులు చెప్పారు.

NLG: నేడు లెంకలపల్లి గ్రామానికి రానున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేడు సాయంత్రం 4 గంటలకు మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామానికి విచ్చేయుచున్నట్లు, లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణానికి మంజూరు అయినటువంటి 'ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్' ను ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

NLG: మునుగోడు ఎమ్మేల్యే రాజ గోపాల్ రెడ్డి.. బుధవారం పర్యటన వివరాలు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

ఈనెల 24న బుధవారం, మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మునుగోడు మండలంలో ఉదయం 09:00 గంటలకు కొంపల్లి గ్రామంలో, 10:30 గంటలకు ఊకొండి గ్రామంలో, మర్రిగూడెం మండలంలో మధ్యాహ్నం 12:00 లకు కొట్టాల, 2:00 గంటలకు మేటి చందాపురం (ఇందుర్తి), సాయంత్రం 4:00 గంటలకు లెంకలపల్లి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

NLG: కేంద్రంలో బిజెపి దే అధికారం: బిజెపి నాయకులు బూర నర్సయ్య గౌడ్

నల్లగొండ: కేంద్రంలో మళ్లీ బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని, దేశవ్యాప్తంగా సుమారు 360 ఎంపీ సీట్ల నుండి 400 సీట్ల వరకు బిజెపి గెలుచుకుంటుందని బిజెపి జాతీయ నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. మంగళవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో 10 నుండి 12 సీట్ల వరకు బిజెపి గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.

అయోధ్యలో న భూతో, న భవిష్యత్తు, అన్నట్లుగా రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగిందని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను తిలకించిన ప్రజలు సంబరాలు ఘనంగా నిర్వహించారని.. భవ్య దివ్య రామాలయాన్ని దర్శించడానికి ప్రజలు ఉత్సాహ పడుతున్నారన్నారు. 

హిందూ ధర్మాన్ని ప్రధానమంత్రి మోడీ విశ్వధర్మంగా వ్యాప్తి చెందడానికి కృషి చేస్తున్నారన్నారు. శ్రీరామనవమి, దీపావళి పండుగలు రెండు ఒకేసారిగా జరుపుకున్నట్లుగా ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారులు. పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, కేంద్రీయ విద్యాలయాలు వంటి అనేక అభివృద్ధి పనులు చేసిందన్నారు.

అయోధ్యలోని రామాలయం సందర్శించడానికి భువనగిరి నల్లగొండ నుండి బిజెపి పార్టీ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిందని తెలిపారు. కేవలం 1900 రూపాయలతో రైలు చార్జీలతో పాటు అయోధ్యలో అకామిడేషన్ దర్శనము భోజన వసతి కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వర్షిత్ రెడ్డి, చింతా ముత్యాల రావు, ముని కుమార్, తదితరులు పాల్గొన్నారు.