NLG: ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
నల్లగొండ: భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజి సుభాష్ చంద్రబోస్ పాత్ర వెలకట్టలేనిదని జనగణమన ఉత్సవ సమితి అద్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, ఆర్డిఓ రవి అన్నారు. మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆజాద్ హిందు ఫౌజ్ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని చెప్పి ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపారు అని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఆజాద్ హిందు ఫౌజ్ పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించారని అన్నారు.
దేశాన్ని కాపాడుకోవాలంటే అహింస ఒక్కటే మార్గం కాదు, పోరాటాలు కూడా చేయాలి అంటూ గాంధీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టి ఎంతోమంది దేశ భక్తులకు దిశా నిర్దేశం చేశారని అన్నారు. చివరి వరకు దేశం కోసమే బతికిన సుభాష్ చంద్రబోస్ మరణం మాత్రం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్, అదనపు ఎస్పి విఠల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్, జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్, సహాయ అద్యక్షులు దోసపాటి శ్రీనివాస్, చందా శ్రీనివాస్, పోలా జనార్దన్, నాగేందర్, శ్యాంసుందర్ రెడ్డి, ప్రదీప్, మరియు మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్, గంధపాలకులు డాక్టర్ రాజారాం, తదితరులు పాల్గొన్నారు.
Jan 24 2024, 19:57