NLG: గురుకుల పాఠశాల విద్యార్థిని దాసరి భార్గవి మృతి పై విచారణ జరిపి న్యాయం చేయాలి: ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్
దేవరకొండ: డివిజన్ పరిధిలోని కొండ మల్లేపల్లిలోని ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దాసరి భార్గవి మృతిపై విచారణ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఎస్సీ గురుకుల ఆర్సిఓ అరుణ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆకారపు నరేష్ మాట్లాడుతూ.. మల్లేపల్లి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని దాసరి భార్గవి మృతి పై విచారణ జరిపి న్యాయం చేయాలని, భార్గవి మృతి గల కారణాల పైన సమగ్ర విచారణ జరపాలన్నారు. ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.
నల్గొండ జిల్లాలో వరుసగా గురుకులాల్లో విద్యార్థులు పిట్టలలా రాలిపోతున్నారు. వీటన్నిటిపై ప్రధానమైన కారణాలు తెలియజేసి కారకులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్, మహి, పాషా, శివ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Jan 23 2024, 15:20