NLG: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి దరఖాస్తుదారులకు రిప్లై పంపాలి: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: ప్రజా వాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం చేయనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రజా వాణి కార్యక్రమం లో మంత్రి కోమటి రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి దరఖాస్తు దారులకు రిప్లై పంపాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం ప్రజా వాణి కార్య క్రమం అని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజా భవన్ లో సామాన్యుల సమస్యలు వినేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక కోటి 50లక్షలు దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీ లు అమలు చేయటానికి కట్టు బడి వుందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు, 200 యూనిట్ ల ఉచిత కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, 500 రూ.లకు గ్యాస్ సిలిండర్, పెన్షన్లు అమలు చేస్తామని తెలిపారు .
20 కోట్ల రూ.ల తో ITI వద్ద నిరుద్యోగ యువతకు శిక్షణనందించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు, ఈ నెల 26 న శంఖుస్థాపన వేయనున్నట్లు తెలిపారు.
జిల్లాలో సాగు నీటి పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తామని అన్నారు. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కి కలెక్టరేట్ వద్ద 10 ఎకరాలు స్థలం లో లే అవుట్, రోడ్లు పూర్తి చేసి జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని అన్నారు.
ఏ.యం.అర్.పి.ప్రాజెక్ట్ రూ. 510 కోట్ల లతో లైనింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని, రూ. 350 కోట్ల లతో రిపేర్ లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్.ఎల్.బి.సి కెనాల్ పనులు వ్యయం పెరిగినందున ప్రభుత్వ ఆమోదం తో పనులు చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరి చందన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, మున్సిపల్ ఛైర్మెన్ అబ్బగోని రమేష్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Jan 22 2024, 18:03