NLG: ఇరిగేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మర్రిగూడ: మునుగోడు నియోజకవర్గం లోని ఇరిగేషన్ పైన యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా ఇరిగేషన్ అధికారులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ధర్మారెడ్డి కాలువ, బునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువల సమస్యలు వాటి పరిష్కార మార్గాలపైన సుదీర్ఘంగా చర్చ జరిపారు. నల్గొండ జిల్లా పరిధిలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులైన శివన్న గూడెం (చర్లగూడెం), కిష్ట రాంపల్లి (లక్ష్మణపురం) ప్రాజెక్టుల పనులు ఎలా ఉన్నాయి.. ఈ రెండు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందిందా? ఇంకా ఏమైనా పెండింగ్ ఉందా? అని ఆరా తీశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన విషయాలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా లకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Jan 22 2024, 10:31