NLG: చండూరు లో బీఎస్పీ పార్లమెంటు సన్నాహక సమావేశం
నల్లగొండ జిల్లా:
చండూరు: బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఆధ్వర్యంలో.. చండూరు మండల కేంద్రంలో, భువనగిరి పార్లమెంటు సన్నహక సమావేశం నిర్వహించారు. చండూరు బీఎస్పీ మండల అధ్యక్షులు నేరళ్ల ప్రభుదాసు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో, బిఎస్పి పార్లమెంట్ ఇన్చార్జి కొండమడుగు రాజు హాజరై మాట్లాడుతూ.. బూత్ కమిటీలు సక్రమంగా పనిచేస్తే ఎంపీ ఎలక్షన్లలో మనం గెలవచ్చని సూచన ఇచ్చారు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో 307 బూతులు ఉండగా ఒక్కొక్క బూత్ కు 5 నుండి 10 కార్యకర్తలు తయారు చేసుకుని వారు ఒక్కొక్కరు మళ్లీ ఒక్కరి చొప్పున 10 మందిని తయారు చేసుకోవాలని.. అలా చేస్తేనే మనం గెలవచ్చని సూచించారు. వారానికి ఒకసారి మండల నాయకులు మరియు మండల అధ్యక్షులు బూత్ కమిటీలకు క్యాడర్ కాంప్స్ నిర్వహించాలని అన్నారు.
రాష్ట్ర కార్యదర్శులు శంకర్ రెడ్డి, ఐత రాజు అభయందర్, ఈస్ట్ జోన్ మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజారావు,జిల్లా కోశాధికారి నాగేంద్రబాబు, మునుగోడు అసెంబ్లీ అధ్యక్షులు చిలక రాజు శివ, మునుగోడు ఇంచార్జ్ ఏర్పుల అర్జున్, సీనియర్ నాయకులు మాస్క్ నరసింహ, మునుగోడు అసెంబ్లీ కార్యదర్శి అన్నేపాక శంకర్, ఉపాధ్యక్షులు సైదులు యాదవ్, నీరుడు చంద్రం, మున్సిపల్ అధ్యక్షులు బూషిపాక మాణిక్యం, ఉపాధ్యక్షులు నల్లగంటి మల్లేశం,BVF జిల్లా కన్వీనర్ కురుపాటి సామ్రాట్ కిరణ్, శంకర్ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
Jan 21 2024, 13:16