NLG: ఫుట్బాల్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ
నల్గొండ: మేకల అభినవ్ స్టేడియంలో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న 25 మంది క్రీడాకారులకు, నిన్న సాయంత్రం గంటేకంపు బిక్షమయ్య సత్తెమ్మ ల స్మారకార్థం వారి కుమారులు రవీందర్, లెనిన్ లు స్పోర్ట్స్ కిట్స్ లను పంపిణీ చేశారు.
ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొని స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. క్రీడలు మనుగడ సాధించాలంటే స్పాన్సర్స్ ముందుకు రావడం ఎంతో ముఖ్యమని, ఆ రకంగా 25 మందికి స్పోర్ట్స్ కిట్స్ అందించడానికి ముందరికి వచ్చిన రవీందర్, లెనిన్ లను అభినందిస్తూ, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ గత దశాబ్ద కాలంగా నల్గొండ జిల్లాలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులను చేరదీసి వారిని చదువుతోపాటు, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తుందని తెలియజేశారు.అనంతరం స్పోర్ట్స్ కిట్స్ దాతలను మరియు ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ లను శాలువాతో అబ్బగోని రమేష్ గౌడ్ ఘనంగా సన్మానించారు.
స్పాన్సర్స్ గంటేకంపు రవీందర్, లెనిన్ లు మాట్లాడుతూ.. ఎంతో నిబద్ధతతో కూడిన క్రీడా వ్యవస్థ కలిగిన ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారులకు, మా తల్లిదండ్రులు గంటేకంపు బిక్షమయ్య సత్తెమ్మల స్మారకార్థం స్పోర్ట్స్ కిట్స్ అందజేస్తున్నామని, క్రీడల్లో చదువుల్లో రాణించే బీద విద్యార్థులకు భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారాలు అందిస్తామని తెలిపారు.
చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల నుండి నల్గొండ లో పాఠశాల దశ నుండే, ఒక మంచి స్పోర్ట్స్ కల్చర్ ను తయారు చేస్తూ నల్గొండ జిల్లా నుండి కబడ్డీ ఫుట్బాల్ జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తున్నామని, ఇటీవలనే చత్రపతి శివాజీ క్రికెట్ క్లబ్ ను కూడా ఏర్పాటు చేశామని తెలియజేస్తూ, క్రీడా వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ఒక భాగమైతే, స్పాన్సర్లు ముందుకు రావడం రెండవ భాగమని ఆ రకంగా నల్లగొండలో స్పోర్ట్స్ కల్చర్ ఇంకా డెవలప్మెంట్ కావాలంటే, క్వాలిటీ క్రీడాకారులను తయారు చేయాలంటే వివిధ కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు దాతలు ముందుకు రావాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న DYSO మక్బూల్ మొహమ్మద్ మాట్లాడుతూ.. మేకల అభినవ్ స్టేడియంలో అన్ని రకాల క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులు గ్రాస్ రూట్ నుండి తయారవుతున్నారని తెలియజేశారు.
అనంతరం డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ మరియు చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అబ్బ గోలి రమేష్ గౌడ్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, పబ్బు సందీప్ గౌడ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, మరియు క్రీడా పోషకులు జాకటి బాలరాజు, అప్పల లింగయ్య, సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు రాచూరి వెంకట సాయి, కోక్కు యశ్వంత్, శివదాసు మరియు క్రికెట్, హాకీ, టైక్వాండో కోచ్ లు SK రహీం, యావర్, ప్రణీత్ లు, స్టేడియం ఇన్చార్జి కత్తుల హరి మరియు హాకీ, ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.
Jan 19 2024, 11:33