బాలకృష్ణలు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు
బాలకృష్ణలు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు
కొడాలి నాని
టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి అంటూ వ్యాఖ్యానించారు.
వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరని తేల్చి చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరని అంటూ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా?” అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు.
ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు.
Jan 18 2024, 13:41