నేడు నుంచి రైతు ఖాతాల్లో రైతుబంధు
నేడు నుంచి రైతు ఖాతాల్లో రైతుబంధు
ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా, నందిపేట మండలం, ఆంధ్రానగర్‌లో ది వంగత నందమూరి తారక రామారావు విగ్రహా న్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడు తూ…ఎన్ని ఇబ్బందులున్నా రైతు డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, రై తాంగ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తా మని అన్నారు. నందమూరి తారకరామారావు ఆశీస్సు లతో రాజకీయా లలోకి వచ్చిన తామంతా, ఆ మహానుభావుని ఆశయా లకు అనుగుణంగా అదే నిబద్దత, నిజాయితీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశమంతటా అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. రైతుల అవస రాలు, కష్టాలు తెలిసిన వ్య క్తిగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే రెండకరాల లో పు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మం ది రైతులకు రైతుబంధు అందించామని, మి గతా రైతులకు కూడా గురువారం నుండే వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతుబంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు.
Jan 18 2024, 10:01