ఆంధ్ర లో తెలంగాణ పందెం కోడి..
ఆంధ్ర లో తెలంగాణ పందెం కోడి
సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగే కోడి పందేలకు హైదరాబాద్ పాత నగర శివారు ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది.
జల్‌పల్లి మున్సిపల్ పరిధిలో పందెం కోళ్ల కూతలు వినిపిస్తాయి. ఎర్రకుంట, షాహిన్‌నగర్, కొత్తపేట, సలాల పరిసరాల్లో కాకి, డేగ, నెమలి, అస్లీ తదితర మేలు జాతి కోడి పుంజులను పెంచుతారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలకు ఇక్కడి నుంచి కోళ్లను ఎగుమతి చేస్తుంటారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి పోటీలకు కొనుగోలు చేస్తుంటారు.
Jan 16 2024, 08:01