NLG: ఇందుర్తి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు
నల్గొండ జిల్లా:
మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా, శనివారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు, జూనియర్ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రజానాట్యమడలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఆటలో ప్రాధాన్యత కలిగిన క్రీడాకారులు ఉన్నారని.. వారికి మరింత శిక్షణ అవసరమని అదే రకంగా ఫిట్నెస్, స్నేహభావాన్ని పెంపొందించుకోవడం, కులాలకు మతాలకు అతీతంగా నడుచుకొని పోవడం క్రీడాకారులకు అవసరమని ఆయన అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, చేగువేరా లను ఆదర్శంగా తీసుకొని అభ్యుదయం వైపు యువత నడవాలని ఆయన అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని అన్నారు.
తదనంతరం బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిలి ప్రసన్న రవి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, గిరి విష్ణు, బద్రి, ఐతగోని నరసింహ, ఎండి ఉసేన్, మహేశ్వరం గణేష్, ఏర్పుల శివనందిని, పగిళ్ల శ్రీను,గిరి కరుణ్, పవన్ చారి, వంశీ, తదితరులు పాల్గొన్నారు
Jan 14 2024, 08:22