/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ యూనివర్సిటీలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు Raghu ram reddy
ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ యూనివర్సిటీలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నా మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.

నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నా మని, ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు.

జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు శుక్రవారం వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయం లో యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

5 వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొనగా 6500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు

AP Govt: అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మరోసారి అంగన్‌వాడీలను చర్చలకు పిలిచింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌తో చర్చలు జరపనున్నారు..

ఈ సమావేశానికి అంగన్వాడి వర్కర్ల కార్మిక సంఘాలు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికీ 32 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంతో ఐదు సార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలు జరపనున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు.. సమ్మె విరమించుకోమని తేల్చి చెబుతున్నారు అంగన్వాడీలు

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న కారు

 మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన కారు.

కారులోని వ్యక్తికి తీవ్ర గాయాలు, జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించిన పోలీసులు.

అదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో నిలిచిన పత్తి కొనుగోలు

అదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు శుక్రవారం పత్తిని విక్రయించడానికి వాహనా ల్లో రైతులు భారీగా పత్తిని తీసుకువచ్చారు. నిలువ చేసిన పత్తి బేళ్ల సరఫరా నిలిచిపోయిందంటూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లను నిరాకరించారు.

ఉదయం 5 గంటల నుంచి రైతులు వాహనాల్లో పంట ను తీసుకురావడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పత్తి కొనుగోలు నిలిపి వేయ డంతో రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే పంట కొనుగోలను ప్రారంభించా లని కలెక్టర్ చొరవ తీసు కోవాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్ శ్యామలాదేవి వ్యాపారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కొద్దిసే పట్లో పంటను కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు.

కూలిన ఖమ్మం గ్రంథాలయం

ఖమ్మంలోని జిల్లా గ్రంథా లయం భవనం ఇవాళ పేకమేడలా కుప్పకూలి పోయింది.

ఖమ్మం నగరంలోని పెవి లియన్ గ్రౌండ్ ప్రక్కన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదు రుగా ఉన్న జిల్లా గ్రంథాల యం కాలం చెల్లింది కావటంతో ఒక్కసారిగా కూలిపోయింది.

దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఇవాళ సెలవు కావడంతో పత్రిక విభాగంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది స్థాని కులు చెబుతున్నారు.

హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న స్థాని కులు సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను అప్ర మత్తం చేసి అనంతరం పరీశీలించారు.

నూతన ఎక్స్ ప్రెస్ రైళ్లను ను ప్రారంభించిన: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

స్విట్జర్లాండ్‌తో సమానంగా భారతీయ రైల్వే నెట్‌ వర్క్‌ను అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. 53 శాతం రాయితీతో భారతీయ రైల్వే సేవలు అందిస్తున్నదని అన్నారు.

రోజుకు 16 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ పెరుగుతున్నదని తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మంత్రి కిషన్‌ రెడ్డి ఈరోజు ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో రైల్వే బడ్జెట్‌ రూ.8 వేల కోట్ల నుంచి రూ.29 వేల కోట్లకు పెరిగిందన్నారు. అయితే మోదీ ప్రభుత్వంలో అది రూ.2.8 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు.

దక్షిణమధ్య రైల్వే మరో మూడు రైళ్లను ప్రయాణి కులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. హుబ్బల్లి-నర్సాపూర్‌, విశాఖపట్నం-గుంటూరు, నంద్యాల-రేణిగుంట ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. నేటి నుంచి ఇవి సేవలను ప్రారంభిస్తాయని ఆయన అన్నారు

బిఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు రాజీనామా

తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కు 21 మంది కౌన్సిలర్లు రాజీనామా ఈరోజు రాజీనామా చేశారు.

మంచిర్యాల జిల్లా బెల్లం పల్లిలో క్యాంపు రాజకీ యాలు ఉత్కంఠ రేపు తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు గురువారం రాజీనామా చేశారు.

వారం రోజుల క్రితం బీఆర్ఎస్ కు చెందిన 18 మంది కౌన్సిలర్లు క్యాంపు నకు తరలి వెళ్లారు.

బెల్లంపల్లిలో ఈ నెల 12న అవిశ్వాసం నేపథ్యంలో కౌన్సిలర్లు ఒక్కసారిగా పార్టీకి రాజీనామాలు ప్రకటించడం చర్చనీ యాంశంగా మారింది.

జగిత్యాల జిల్లా కేంద్రంలో చోరీ

జగిత్యాల పట్టణంలోని పురాణిపేటకు చెందిన నోముల సాగర్ ఇంట్లో గురువారం తెల్లవారు జామున చోరీ జరిగింది.

ఇంటి యజమాని తన కుటుంబ సభ్యులతో గత నెల రోజుల క్రితం అమెరి కాకు వెళ్ళగా తాళం వేసి వున్న ఇంటిని గమనించిన దొంగలు గడ్డపార సాయంతో ఇంటి తాళాలు పగులగొట్టి కప్ బోర్డులో ఉన్న లాకర్ లో ఉన్న అర తులం బంగారం, 5వేల నగదు ఎత్తుకెళ్లారనీ నోముల సాగర్ తెలిపారు.

నేడు మహబూబాబాద్ జిల్లా పార్లమెంటు ఎన్నికల సమీక్ష సమావేశం

పార్లమెంట్‌ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. నేడు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీర్ఎస్‌ సమీక్షా సమావేశం నిర్వహించనుంది.

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట డోర్నకల్ మహబూబాబాద్ ఇల్లందు, పినపాక భద్రా చలం నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించ నున్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీర్ఎస్‌ సమీక్షా సమావే శానికి బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు

మోహాలీ వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ టి20 మ్యాచ్

నేడు ఇండియా , ఆఫ్ఘన్‌ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఆఫ్ఘనిస్తాన్, భారత జట్ల మధ్య జరిగే తొలి టీ20 మొహలీ వేదికగా జరుగనుంది..తొలి టీ20లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరిగే మొహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలి స్తుంది.

ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేస్తే చేదనలోను అదే జోరు కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంట ఇక్కడ 6 మ్యాచులు జరిగితే నాలుగింట్లో ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇక భారత్ ఇక్కడ 4 టీ20ల్లో 3 నెగ్గింది. ఆస్ట్రేలియా చేతిలో 2022లో ఓడింది. ఇక ఈ మ్యాచ్‌ కు కోహ్లీ దూరం కానున్నాడు. ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.