నూతన ఎక్స్ ప్రెస్ రైళ్లను ను ప్రారంభించిన: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
స్విట్జర్లాండ్‌తో సమానంగా భారతీయ రైల్వే నెట్ వర్క్‌ను అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 53 శాతం రాయితీతో భారతీయ రైల్వే సేవలు అందిస్తున్నదని అన్నారు.
రోజుకు 16 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ పెరుగుతున్నదని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రైల్వే బడ్జెట్ రూ.8 వేల కోట్ల నుంచి రూ.29 వేల కోట్లకు పెరిగిందన్నారు. అయితే మోదీ ప్రభుత్వంలో అది రూ.2.8 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు.
దక్షిణమధ్య రైల్వే మరో మూడు రైళ్లను ప్రయాణి కులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. హుబ్బల్లి-నర్సాపూర్, విశాఖపట్నం-గుంటూరు, నంద్యాల-రేణిగుంట ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నేటి నుంచి ఇవి సేవలను ప్రారంభిస్తాయని ఆయన అన్నారు
Jan 12 2024, 16:04