/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz విశాఖలో సాగర తీరాన కలకలం రేపిన మానవ అస్థిపంజరం... Miryala Kiran Kumar
విశాఖలో సాగర తీరాన కలకలం రేపిన మానవ అస్థిపంజరం...

విశాఖలో సాగర తీరాన కలకలం రేపిన మానవ అస్థిపంజరం. 

పెదగంట్యాడ మండలం అప్పికొండ సముద్ర తీరంలో అస్థిపంజరం లభ్యం.  

సముద్రంలో నుంచి కొట్టుకు వచ్చిందా? లేదా ఎవరైనా పాతిపెట్టారా అనేది మిస్టరీగా మారింది.

ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

అమరావతి: వైసీపీ మూడో జాబితా విడుదల..

అమరావతి: వైసీపీ మూడో జాబితా విడుదల.. 23 మందితో వైసీపీ మూడో జాబితా.. సూళ్ళూరుపేట- తిరుపతి ఎంపీ గురుమూర్తి , పెడన - ఉప్పాల రాము, పెనమలూరు - జోగి రమేష్, చిత్తూరు-విజయానంద రెడ్డి, మార్కాపురం -జంకె వెంకట రెడ్డి, రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి, పూతలపట్టు - డా. సునీల్, తిరువూరు - నల్లగట్ల స్వామి దాస్.

హైదరాబాద్‌: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరిస్కరించడం సరికాదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరిస్కరించడం సరికాదు.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడింది.. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.. జనవరి 22 కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది.. అయోధ్య కేసు విచారణ సమయంలో కాంగ్రెస్ వితండవాదం చేసింది.. అసలు రాముడు ఉన్నాడా అంటూ కోర్టులో వాదనలు వినిపించింది.. బహిష్కరించడం కాంగ్రెస్‌కు అలవాటైంది. -కిషన్‌ రెడ్డి

అమరావతి: నేడు జగనన్న తోడు పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్..

అమరావతి: నేడు జగనన్న తోడు పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం.. చిరు వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం

ప్రజాపాలన దరఖాస్తులను తప్పుగా నిర్వహించినందుకు ప్రభుత్వ అధికారిని సస్పెండ్ ...

ప్రజాపాలన దరఖాస్తులను తప్పుగా నిర్వహించినందుకు ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేశారు

 ప్రజల నుంచి సేకరించిన ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‌లను పక్కదారి పట్టించారనే ఆరోపణలపై హయత్‌నగర్ ట్యాక్స్ సెక్షన్ సర్కిల్-3 సూపర్‌వైజర్ ఎం. మహేందర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మంగళవారం సస్పెండ్ చేశారు.

బాలానగర్ ఫ్లైఓవర్‌పై బైకర్ పడవేయడంతో రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న ఫారమ్‌లు కనిపించిన వైరల్ వీడియో ఆధారంగా ఈ చర్య జరిగింది.

బాటసారులు వెంటనే వీడియోను రికార్డ్ చేసి, ఈ ఫారమ్‌లు ఎందుకు ఉన్నాయని ఆ వ్యక్తిని ప్రశ్నించగా, అతను డేటా ఎంట్రీ ఉద్యోగం ఇచ్చిన ఏజెన్సీలో పనిచేశాడని రికార్డ్ చేశారు.

ధరణి పోర్టల్ అధ్యాయానికి ఐదుగురు సభ్యులతో కమిటీ

ధరణి పోర్టల్ అధ్యాయానికి ఐదుగురు సభ్యులతో కమిటీ

ధరణి పోర్టల్‌పై అధ్యయ నానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కాంగ్రెస్‌ అనుబంధ కిసాన్‌ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, అడ్వకేట్‌ సునీ ల్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ రేమండ్‌ పీటర్‌, రిటైర్డ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బీ మధుసూదన్‌ ఈ కమిటీలో ఉన్నారు.

దీనికి సీసీఎల్‌ఏ సభ్య కార్యదర్శిగా వ్యవహరిం చనున్నారు.ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పోర్టల్‌కు సంబంధించిన సమస్యల అధ్యయనం, పరిష్కారం కోసం కమిటీని నియమిస్తున్నట్టు తెలిపా రు. రెవెన్యూ శాఖ అధికా రులు, కలెక్టర్లు ఈ కమిటీకి సహకరించాలని సూచిం చారు.

చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురి..

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రమాదానికి గురైంది. డెడ్‌ఎండ్ గోడను ఢీకొనడంతో మూడు బోగిలు S2, S3, S6 పక్కకు ఒరిగాయి. రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ట్రైన్‌ చాలా తక్కువ స్పీడ్‌తో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది. దిగడానికి సిద్ధంగా ఉన్న వారు గాయపడ్డారు. క్షతగాత్రులను లాలాగూడ ఆస్పత్రికి తరలించారు. వారు పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తామని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్ తెలిపారు. మరోవైపు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద అనంతరం అక్కడ మరమ్మతులు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బంది రెస్స్యూ ఆపరేషన్ చేపట్టారు.అలాగే ఈ ప్రమాదంపై ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు.

నల్లగొండ:A P అంగన్వాడి ల పై ఎస్మా అన్యాయం,ప్లే కార్డులతో నిరసన..

A P అంగన్వాడి ల పై ఎస్మా అన్యాయం

ప్లే కార్డులతో నిరసన

    పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని అడిగితే ఎస్మా లు ఉపయోగిస్తారా అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU )అనుబంధం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి లు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

       మంగళవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ సిడిపిఓ ఆఫీస్ ముందు నల్ల జెండాలు, ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వేతనాల కోసం సమ్మె చేస్తున్న ఏపీ అంగన్వాడీలపై ఏస్మా పేరుతో జీవో నెంబర్ రెండు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.అధికారంలోకి వచ్చిన నాడు ఏపీ జగన్మోహన్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువజీతాలు పెంచుతానని చెప్పిన మీ మాటలు ఎటు పోయాయి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రులకు లక్షల్లో జీతాలు పెంచుకునే మీకు నిరంతరం పేద ప్రజల కోసం దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లలను తీర్చిదిద్దే వారికి మెరుగైనటువంటి పౌష్టికాహారం అందించేటువంటి అంగన్వాడీ టీచర్స్ కు ఎందుకు జీతాలు పెంచడంలేదని ప్రశ్నించారు.పదివేల జీతం టీచర్స్ కు, హెల్పర్స్ ,మినీ టీచర్స్ కు 7000 రూపాయల జీతంతో ఎలా అంగన్వాడీలు బతుకుతారని, వాళ్ళ కుటుంబ పోషణ ఎలా సాగుతుందని ప్రశ్నించారు.కడుపు కాలీ సమ్మె చేస్తుంటే జీతాలు పెంచకుండా ఎస్మా ఉపయోగించడం ప్రభుత్వ చేతగానితనం అన్నారు కార్మికులకు సమ్మెకు జన్మ హక్కు అని దాన్ని కాలరాసే ఏ ప్రభుత్వానికైనా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు గతంలో అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులతో చర్చలు జరిపి వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గం ఎక్కడ పోరాటాలు చేసిన వారికి అండగా సంఘీభావంగా సిఐటియు ఉంటుందని వారు తెలిపారు

   ఈ కార్యక్రమంలో సునంద, సముద్రమ్మ, సరిత ,రేణుక , అనిత, శ్రీలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు

   

 .

నల్లగొండ:బిల్ కిస్ బానో కేసు తీర్పుపై హర్షం :ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి

బిల్ కిస్ బానో కేసు తీర్పుపై హర్షం ....ఐద్వా

గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గం రాజీనామా చెయ్యాలి.....

   పాలడుగు ప్రభావతి కేంద్ర కమిటీ సభ్యురాలు (AIDWA)

     భారత సుప్రీంకోర్టు బిల్ కిస్ బానో కేసుపై తీర్పునిస్తూ ఆ కేసులో ముద్దాయిలైన 11 మంది విడుదల అవటానికి కారణమైన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రెండు వారాలలోగా 11 మంది ముద్దాయిలను విడుదల అయిన జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలిచ్చిందని ఈ తీర్పును అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి హర్షం వ్యక్తం చేశారు.

     న్యాయమూర్తులైన జస్టిస్ నాగరత్నమ్మ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ల సుప్రీంకోర్టు బెంచ్ 2002 నాటి గుజరాత్ లో జరిపిన అత్యాచారాల హంతక ముద్దాయిలకు శిక్షాకాలంలో రెమిషన్ ఇవ్వవచ్చుననే నిర్ణయంతో సిఫార్సు చేసిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను తప్పు పట్టిందని అన్నారు. ఆ సిఫార్సుని ఆధారం చేసుకుని ఒకానొక సుప్రీంకోర్టు బెంచ్ యావత్ జీవకారాగార శిక్ష అనుభవిస్తున్న వారిని 2022 ఆగస్టు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసలు అలాంటి రెమిషన్ యధాలాపపు (Sterio type) నిర్ణయమని, అలాంటి నిర్ణయం గైకొనే అర్హత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు.

2002లో గోధ్రా రైలులో సంభవించిన మారణకాండ సాకుతో, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండిన గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచ మానవాళి సిగ్గుపడేలా అమాయక ముస్లిం ప్రజానీకం పై ఘోరమైన హత్యాకాండ, మహిళలపై అత్యాచారాలు రోజుల తరబడి జరిగాయని అలాంటి దాడుల నుండి తప్పించుకోవటానికి 2002 మార్చి 3వ తేదీన అహ్మదాబాద్ కు దగ్గరలోని రంధిక్ పూర్ అనే గ్రామం విడిచి పోతున్న వారిలో ఐదు నెలల గర్భవతిగా ఉన్న బిల్ కిస్ బానో అనే 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిపి ఆమె మూడేళ్ల పసి బాలికతో సహా 7గురు కుటుంబ సభ్యులను హత్య గావించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంవత్సరం నుండి ఆ కేసు పలు మలుపులు తీసుకుంది. సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిపారు. గుజరాత్ రాష్ట్రంలో విచారణ జరపటానికి వీలులేదని మహారాష్ట్రలో దానిని సాగించగా దాని బొంబాయి ట్రయల్ కోర్టు 11 మంది ముద్దాయిలకు 2008లో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది . 2017లో బొంబాయి హైకోర్టు వారి శిక్షను ఖరారు చేసింది. 2019లో సుప్రీంకోర్టు బిల్ కిస్ బానోకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించమని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని అన్నారు.

 ఈ కేసులో ముద్దాయిలకు మరణశిక్ష విధించ దగినప్పటికీ దానిని యావత్ జీవకారాగార శిక్షగా మార్పు చేశారని,  

కొన్ని కోర్టు సవరణలను అడ్డం పెట్టుకుని 14 ఏళ్ల శిక్షకాలం తరువాత వారికి రెమిషన్ అవకాశాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి కేసు విచారణ జరిగిన, శిక్ష విధించిన మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే రెమిషన్ గురించిన సిఫారసు చేసే అవకాశం ఉన్నది. కానీ, ఆ హక్కును అడ్డం పెట్టుకొని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ సిఫారసు చేసింది. ఆ విధంగా భయంకర నేరానికి పాల్పడిన 11మంది ముద్దాయిలకు 75 ఏళ్ల స్వాతంత్ర అమృతకాలం అని పేరుపొందిన 2022 ఆగస్టు 15న విడుదల అయ్యే అవకాశం లభించింది. వారిని గుజరాత్ రాష్ట్ర బిజెపి నాయకులు దండలతో అభినందనలతో స్వాగత సత్కారాలు నిర్వహించటం విజయోత్సవాలు జరిపటం సిగ్గుచేటు అన్నారు.

ఈరోజు తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు, తనకు లేని అధికారాలను ఉపయోగించుకుని బిల్ కిస్ కేసులో ముద్దాయిలకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ వచ్చేట్లు చేయటాన్ని తప్పు పట్టిన దృష్ట్యా, తక్షణమే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం రాజీనామా చేయాలన్నారు. నేడు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను పూర్తిగా ఖండిస్తూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం ఐద్వా హర్షం వ్యక్తం చేస్తుందని తెపారు. గుజరాత్ రాష్ట్ర క్యాబినెట్ రాజీనామా చేయాలని ఐద్వా తరుపున డిమాండ్ చేస్తున్నారు.

సూర్యాపేట శ్రీ వాసవి దేవాలయంలో మహిళల గాజుల పండుగ..

శ్రీ వాసవి దేవాలయం లో మహిళల గాజులు పండుగ

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం మహిళలు గాజుల పండుగ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఒక్క మగ బిడ్డ తల్లి, ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లితో గాజులు వేసుకోవాలని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని గాజులు తొడి గించుకున్నారు. సంక్రాంతికి ముందు గాజులు వేసుకోవాలని లేనిచో కీడు జరుగుద్ది అనే ప్రచారం ఉండడంతో ఒకరికొకరు గాజులు వేసుకొని అలంకరించుకున్నారు. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్టను పురస్కరించుకొని అయోధ్య అక్షితలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రీదేవి, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి, వాసవి జిల్లా మొదటి మహిళా రాచర్ల లక్ష్మి, తోట కమల, గుండా సుధా మాధురి, రాచర్ల ప్రేమలత, గజ్జి నీలిమ, గుండా సువర్ణ, ఈగ శారద, భాగ్యలక్ష్మి, నల్లపాటి రమాదేవి, వెంపటి విజయ, కక్కిరెని పద్మ, పోతుగంటి సునిత తో పాటు 50 మంది మహిళలు పాల్గొన్నారు.