నల్లగొండ:A P అంగన్వాడి ల పై ఎస్మా అన్యాయం,ప్లే కార్డులతో నిరసన..
A P అంగన్వాడి ల పై ఎస్మా అన్యాయం
ప్లే కార్డులతో నిరసన
పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని అడిగితే ఎస్మా లు ఉపయోగిస్తారా అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU )అనుబంధం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి లు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మంగళవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ సిడిపిఓ ఆఫీస్ ముందు నల్ల జెండాలు, ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వేతనాల కోసం సమ్మె చేస్తున్న ఏపీ అంగన్వాడీలపై ఏస్మా పేరుతో జీవో నెంబర్ రెండు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.అధికారంలోకి వచ్చిన నాడు ఏపీ జగన్మోహన్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువజీతాలు పెంచుతానని చెప్పిన మీ మాటలు ఎటు పోయాయి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రులకు లక్షల్లో జీతాలు పెంచుకునే మీకు నిరంతరం పేద ప్రజల కోసం దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లలను తీర్చిదిద్దే వారికి మెరుగైనటువంటి పౌష్టికాహారం అందించేటువంటి అంగన్వాడీ టీచర్స్ కు ఎందుకు జీతాలు పెంచడంలేదని ప్రశ్నించారు.పదివేల జీతం టీచర్స్ కు, హెల్పర్స్ ,మినీ టీచర్స్ కు 7000 రూపాయల జీతంతో ఎలా అంగన్వాడీలు బతుకుతారని, వాళ్ళ కుటుంబ పోషణ ఎలా సాగుతుందని ప్రశ్నించారు.కడుపు కాలీ సమ్మె చేస్తుంటే జీతాలు పెంచకుండా ఎస్మా ఉపయోగించడం ప్రభుత్వ చేతగానితనం అన్నారు కార్మికులకు సమ్మెకు జన్మ హక్కు అని దాన్ని కాలరాసే ఏ ప్రభుత్వానికైనా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు గతంలో అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులతో చర్చలు జరిపి వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గం ఎక్కడ పోరాటాలు చేసిన వారికి అండగా సంఘీభావంగా సిఐటియు ఉంటుందని వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో సునంద, సముద్రమ్మ, సరిత ,రేణుక , అనిత, శ్రీలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు
.
Jan 10 2024, 13:54