అందరి ఆచారాలు సాంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ సంస్కృతి
దేశంలో క్రిస్మస్ పర్వదినాన ప్రేమ విందును ప్రారంభించిన ఘనత బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి విగ్నేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి పేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలోనే క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినాన బట్టలు పంపిణీ చేసి అధికారంలోకి వచ్చాక దాన్ని అధికారికంగా చేసిన ఘనత ఉద్యమ నేత కేసీఆర్ దే అన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను గౌరవించే సాహసం చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. అందరి ఆచారాలు సాంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ సంస్కృతి అని అదే ఆరోగ్యవంతమైన సమాజం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నేడు క్రిస్మస్ పర్వదినాన బట్టలు పంపిణీ చేసి ప్రేమ విందు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రైస్తవులంతా ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఆర్డిఓ వీరబ్రహ్మ చారి, జెడ్పి సీఈవో సురేష్, తాసిల్దార్ శ్యాంసుందర్, జడ్పిటిసి జీడి బిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, పీస్ట్ కమిటీ అధ్యక్షులు పుల్లురి డానియల్, సెక్రటరీ ఎల్క ప్రభాకర్, వి.బోయాజ్, కోడూరి హేజ్ర, మామిడి ఎలీషా రాజు, మీసాల గోవర్ధన్, మీసాల ప్రభుదాస్, రమేష్ బాబు, సైమన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు పెద్దపంగు స్వ రూప, మైనార్టీ నాయకులు పూర్ణ శశికాంత్, కల్లెపల్లి మహేశ్వరి తదితరులు ఉన్నారు.
Jan 09 2024, 16:15