/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz సూర్యాపేట శ్రీ వాసవి దేవాలయంలో మహిళల గాజుల పండుగ.. Miryala Kiran Kumar
సూర్యాపేట శ్రీ వాసవి దేవాలయంలో మహిళల గాజుల పండుగ..

శ్రీ వాసవి దేవాలయం లో మహిళల గాజులు పండుగ

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం మహిళలు గాజుల పండుగ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఒక్క మగ బిడ్డ తల్లి, ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లితో గాజులు వేసుకోవాలని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని గాజులు తొడి గించుకున్నారు. సంక్రాంతికి ముందు గాజులు వేసుకోవాలని లేనిచో కీడు జరుగుద్ది అనే ప్రచారం ఉండడంతో ఒకరికొకరు గాజులు వేసుకొని అలంకరించుకున్నారు. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్టను పురస్కరించుకొని అయోధ్య అక్షితలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రీదేవి, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి, వాసవి జిల్లా మొదటి మహిళా రాచర్ల లక్ష్మి, తోట కమల, గుండా సుధా మాధురి, రాచర్ల ప్రేమలత, గజ్జి నీలిమ, గుండా సువర్ణ, ఈగ శారద, భాగ్యలక్ష్మి, నల్లపాటి రమాదేవి, వెంపటి విజయ, కక్కిరెని పద్మ, పోతుగంటి సునిత తో పాటు 50 మంది మహిళలు పాల్గొన్నారు.

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్‌ వద్ద నుంచి రూ.12,500 రూపాయల లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఏఈ ఈరోజు ఏసీబీ చిక్కాడు.

వివరాల్లోకి వెళ్తే..కామారెడ్డి 33 /11 కేవీ సబ్ స్టేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రాజు వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్‌ డ్రైవర్ భైరవ స్వామి వద్ద నుంచి లంచం డిమాండ్‌ చేశాడు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు. వారి సూచనల మేరకు కామారెడ్డి సబ్‌ స్టేషన్‌లో రూ.12,500 ఇస్తుండగా ఏసీబీ అధికా రులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అమరావతి: ఇవాళ, రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన..

అమరావతి: ఇవాళ, రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాల పరిశీలన.. నిన్న రాత్రే విజయవాడ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని టీమ్‌.. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం.. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం...

తిరుమల: ఒక కంపార్ట్‌మెంట్‌లో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,511 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,777 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు

కొడుకుంటే కీడట..

కొడుకుంటే కీడట...

కీడుకు రారాజు గాజులట

తెలంగాణలో "గాజుల కానుక" ప్రచారం కలకలం రేపుతోంది. ఒక్కరు లేదా ఇద్దరు కొడుకులు ఉన్న మహిళలు...ఐదుగురి వద్ద డబ్బులు తీసుకుని,ఐదు రకాల గాజులు వేసుకోవాలనే మూఢ నమ్మకం ట్రెండింగ్ లో కొచ్చింది.ఈ సంప్రదాయం ఫాలో కాని ఎడల కీడు జరుగుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో....ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు ఆడ పడుచులు.ఇప్పుడు తెలంగాణ లో ఎక్కడ చూసినా....గాజుల ఇష్యూ చర్చే సాగుతోంది.దాంతో మూఢ నమ్మకాల పుణ్యమాని గాజుల దుకాణ దారులకు భలే గిరాకీ తగిలింది. గాజులకు కూడా డిమాండ్ పెరిగింది.కాగా ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు నిపుణులు.ఇలాంటి మూఢ నమ్మకాలని నమ్మొద్దని సూచిస్తున్నారు.ఏదేమైనా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు మహిళలు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు 

అయోధ్యలో జనవరి 22వ తేదీన శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో..దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈ క్రమంలో హైదారాబాద్ మహానగరం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సీతారాముల కల్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

వేడుకకు త్రిదండి చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని పులకించిపోయారు.A

రాముడు కేవలం భారతదేశానికే కాదు..ప్రపంచానికే రాజుని త్రిదండి చినజీయర్‌ స్వామి తెలిపారు. సుమారు 5 వందల ఏళ్ల తర్వాత రాముడు తన జన్మస్థలానికి చేరుకుంటున్న క్షణం.. దేశ చరిత్రలోనే అద్భుతమన్నారు.

దేశం మొత్తం రామనామ స్మరణ మార్మోగుతున్న వేళ.. రాముడు అయోధ్య కు తిరిగి వస్తున్నాడన్నారు చినజీయర్ స్వామి. అయోధ్య లో రాముడు ప్రతిష్ఠ సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించి తన భక్తిని చాటుకోవడమే కాకుండా ఎంతోమంది సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన కొమురయ్య దంపతులను చినజీయర్ స్వామి అభినందించారు.

 అలాగే జనవరి 20 నుండి మార్చి 11 వరకు ముచ్చింతల సమతామూర్తి రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సీతారాముల కల్యాణం నిర్వహించడం ద్వారా తమ జన్మ చరితార్ధమైందన్నారు డీపీఎస్ చైర్మన్ కొమురయ్య. ఈ సందర్భంగా 5 లక్షల ఇళ్లకు శ్రీరాముడి చిత్ర పటాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సంక్రాంతి సెలవులు రాకముందే విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వ వార్డెన్ల మీద చర్యలు తీసుకోవాలి: కట్టెల శివకుమార్

సంక్రాంతి సెలవలు 4 రోజులు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించింది  షెడ్యూల్ కులముల అభివృద్ధి వసతి గృహాల వార్డెన్లు 7 రోజుల ముందే విద్యార్థులని మీకు పరీక్షలు పూర్తి అయినాయి ప్రభుత్వ నియమ నిబంధనకు వ్యతిరేకంగా విద్యార్థులను హాస్టల్లో నుంచి వెళ్లగొట్టడం జరుగుతుంది. దీనివలన బహుజన విద్యార్థులు చదువుకు దూరం కావడంతో పాటు ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతుంది.వారం రోజుల ముందే విద్యార్థులను ఎల్లగొడుతున్న వార్డెన్స్ ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థులకు న్యాయం జరిగిన చూడాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు.

అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ

అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ

అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి 200 క్వింటాళ్ల బియ్యం వితరణ

200 క్వింటాల బియ్యం (10 లక్షలు) అందజేసిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనరసయ్య)

అయోధ్య, అయోధ్య, అయోధ్య ఏ నోట విన్న ఏ మాట విన్న అయోధ్య రాముడి మాటే తప్ప వేరే మాట వినపడటం లేదు. దేశ మొత్తం ఎదురుచూస్తున్న రామయ్య ప్రతిష్ట మహోత్సవం దగ్గర పడుతున్న శుభ సమయంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య సన్నిధిలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కు సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య 200 క్వింటాల బియ్యం (సుమారు పది లక్షల రూపాయలు విరాళం) శనివారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్మడి సోమన్నరసయ్య మాట్లాడుతూ అయోధ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుటకు నా వంతుగా సహాయ సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారికి అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అందులో నేను సైతం పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు.ఈ కార్యక్రమంలో అమర్నాథ్ సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ చికోటి మధుసూదన్ నిర్వాహకులు నల్ల చంద్రం, కాశం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు...

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మచ్చ ప్రభాకర్ రావు గారి అకాల మరణం పద్మశాలి సమాజానికి తీరని లోటు: పెండం ధనుంజయ

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మచ్చ ప్రభాకర్ రావు గారి అకాల మరణం చాలా బాధాకరం అన్నగారు తమరు లేని లోటు ఊహించడానికి చాలా బాధేస్తుంది తమరు మన కుల సమాజానికి చేసిన సేవలు మరువలేనివి మీతో మాకు మంచి అనుబంధం ఉన్నది మీతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొని పద్మశాలీల అభ్యున్నతి కోసం మేము కూడా పని చేశాము, పద్మశాలీలు రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి మీతో కలిసి ఎవరైతే యువకులు రాజకీయాల్లో ఉన్నారో వాళ్లందర్నీ కలుపుకొని అనేక మీటింగ్లను నిర్వహించి అన్ని పార్టీల కార్యాలయాల చుట్టూ తిరిగాము, ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులను ముఖ్య నాయకులను కలిశాము, మీ యొక్క లక్ష్యం పద్మశాలీలు రాజకీయాల్లో ఉండాలని చట్టసభల్లో ఉండాలని లక్ష్యాన్ని నెరవేర్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అన్నగారు తమరి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని మరియు ఈ పరిస్థితుల నుండి మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకొని, సాధారణ జీవితంలోకి రావాలని వారికి కావలసిన మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ *బాధాతత్వ హృదయంతో. మీ పెండెం ధనుంజయ్ నేత అధ్యక్షులు నల్లగొండ జిల్లా పద్మశాలి యువజన సంఘం.

నాపై హత్యాయత్నం జరిగింది, నరకం అనుభవించా: కేఏ పాల్ సంచలన వాక్యాలు


  • నాపై హత్యాయత్నం జరిగింది, నరకం అనుభవించా: కేఏ పాల్ సంచలనం


విశాఖపట్నం: తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రజా శాంతి పార్టీ (Praja Shanti Party) చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనపై హత్యాయత్నం జరిగిందని పిడుగు లాంటి వార్త చెప్పారు. క్రిస్మస్ వేడుకల సమయంలో డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. క్రిస్మస్ పండుగ సమయంలో టార్గెట్ చేసుకుని తనకు ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేశారని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేఏ పాల్..

ఫుడ్ పాయిజనింగ్ తరువాత ప్రస్తుతం కోలుకుంటున్నానని కేఏ పాల్ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల తాను ప్రాణాలతో బతికి బయటపడ్డానని చెప్పారు.

ఈ విషయం చెప్పొచ్చో లేదోనని ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు. పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నానని, కాన్ఫిడెన్షియల్ గా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.