కొడుకుంటే కీడట..
కొడుకుంటే కీడట...
కీడుకు రారాజు గాజులట
తెలంగాణలో "గాజుల కానుక" ప్రచారం కలకలం రేపుతోంది. ఒక్కరు లేదా ఇద్దరు కొడుకులు ఉన్న మహిళలు...ఐదుగురి వద్ద డబ్బులు తీసుకుని,ఐదు రకాల గాజులు వేసుకోవాలనే మూఢ నమ్మకం ట్రెండింగ్ లో కొచ్చింది.ఈ సంప్రదాయం ఫాలో కాని ఎడల కీడు జరుగుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో....ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు ఆడ పడుచులు.ఇప్పుడు తెలంగాణ లో ఎక్కడ చూసినా....గాజుల ఇష్యూ చర్చే సాగుతోంది.దాంతో మూఢ నమ్మకాల పుణ్యమాని గాజుల దుకాణ దారులకు భలే గిరాకీ తగిలింది. గాజులకు కూడా డిమాండ్ పెరిగింది.కాగా ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు నిపుణులు.ఇలాంటి మూఢ నమ్మకాలని నమ్మొద్దని సూచిస్తున్నారు.ఏదేమైనా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు మహిళలు.
Jan 09 2024, 08:19