ఓ పి ఎస్ సాధన కోసం రిలే నిరాహార దీక్షలు
రైల్వే శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరికీ పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నడికుడి -నల్లగొండ బ్రాంచ్ ల ఆధ్వర్యంలో ఏఐఆర్ యఫ్ పిలుపుమేరకు నల్లగొండ రైల్వే ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ రైల్వే ఉద్యోగ కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అందుకోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రైవేటీకరణ విధానాలను అవలంబిస్తూ అంబానీ, ఆదానిలా రైల్వేలను ప్రవేశపెట్టి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.
బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ కృష్ణారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ సెల్ తెలంగాణ ఏపీ ప్రతినిధి సాంబశివరావు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను మానుకోవాలని వెంటనే పాత పెన్షన్ పథకాన్ని ని పునరుద్ధరించాలని కోరారు కార్మికుల పోరాటాల కు మద్దతు తెలిపారు
ఈ నిరాహార దీక్షలో నల్లగొండ సూపర్వైజర్స్ సాంబశివరావు ,సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నల్గొండ బ్రాంచ్ చైర్మన్ ఎం రామభద్ర రావు, కార్యదర్శి కె వెంకటేష్, ట్రెజరర్ సిహెచ్ ఐలేని నడికుడి బ్రాంచ్ కార్యదర్శి వి ఎస్ సాయికుమార్ అసిస్టెంట్ సెక్రటరీ కే ప్రసాద్ వైస్ చైర్మన్ అబ్రహం కోశాధికారి ఎం శివప్రసాద్,ఆర్ స్వామిరావు, కె భిక్షపతి, వివిధ విభాగాలను ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు
Jan 08 2024, 14:59