YBD: ప్రజా పాలన ద్వారా సంక్షేమ పథకాలను పేదలకు: మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
యాదాద్రి జిల్లా:
చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని
17,18 వార్డులో ప్రజా పాలన అభయహస్తం 06 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన ప్రవేశ పెట్టడం జరిగింది. దరఖాస్తుల స్వీకరణ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాలు అందరికీ చెందుతాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె అభివృద్ధి జరుగుతుంది అని నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారం ప్రజల వద్దకు రావడం జరిగినది అన్నారు.
మహాలక్ష్మీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత కరెంట్, 500 రూ.ల గ్యాస్, గృహ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ప్రతి పేద కుటుంబం బాగుపడుతుంది అని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ధనుంజయ, కౌన్సిలర్ గోపగొని లక్ష్మణ్, కామిశెట్టి శైలజ భాస్కర్, నాయకులు పెద్దగొని రమేష్, వీరమల్ల సతయ్య, తడక అమర్, రహీమ్, చప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఆరిఫ్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Jan 07 2024, 15:19