/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ Mane Praveen
TS: రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

తెలంగాణ క్యాబినెట్ సమావేశము రేపు జరగనుంది. నెలరోజుల పాలన, అభయ హస్తం 6 గ్యారంటీలు సహా పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పలు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఖాళీగా ఉండడంతో, వీటి భర్తీ కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

TS: స్కిల్ యూనివర్సిటీ లను నెలకొల్పుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ అన్నారు.

యువతను గత ప్రభుత్వం మాదిరిగా భారంగా భావించడం లేదని.. వారిని పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

NLG: జాతీయ యువజన ఉత్సవాలలో వక్తృత్వ పోటీలో పాల్గొని.. జిల్లా స్థాయిలో మొదటి బహుమతి అందుకున్న NG కళాశాల విద్యార్థిని

నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని తేజస్విని, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన ఉత్సవాలలో వక్తృత్వ పోటీలో పాల్గొని జిల్లా స్థాయిలో మొదటి బహుమతి అందుకున్నదని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉపేందర్ తెలిపారు. కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. 'మై భారత్ - వికసిత్ భారత్' అనే అంశంపై తేజస్విని వక్తృత్వపోటీలో పాల్గొన్నదని, ఆమె రాష్ట్రస్థాయి పోటీలకు కూడా ఎంపికైందని తెలిపారు. బహుమతిని నెహ్రూ యువ కేంద్రం ప్రవీణ్ సింగ్, జ్యూరీ మెంబర్స్ యాదగిరి రెడ్డి, దుర్గాప్రసాద్, వేణు, కొండ నాయక్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ ను అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ని పలువురు అధ్యాపకులు అభినందించారు.

2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన

2000 రూపాయల నోట్లు ప్రతీ గ్రామంలో వున్న పోస్ట్ ఆఫీస్ ల ద్వారా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లు మార్పిడి కోసం మరియు డిపాజిట్ కోసం ప్రజలు తమ కార్యాలయాల వద్ద బారులు తీరడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆన్లైన్ లో లభించే అప్లికేషన్ నింపి పోస్ట్ ఆఫీస్ కు అందజేసి వారి ద్వారా ఆర్బీఐ యొక్క19 ఇష్యూ కార్యాలయాలకు తమ దగ్గర వున్న 2000 రూపాయల నోట్లు చేర్చాలని తెలిపింది.

NLG: ఫిష్ పాండ్ సందర్శించిన ఎన్జీ కళాశాల పీజీ జువాలజీ విద్యార్థులు

నల్గొండ పట్టణానికి చెందిన నాగార్జున ప్రభుత్వ కళాశాల జువాలజి డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం MSC జువాలజి  విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా గంధ వారి గూడెం లోని ఎమ్మెస్ దేషి మర్రెల్ ఫిష్ పార్మింగ్ ని , చేపల పెంపకాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా సందర్శించడం జరిగింది.

చేపల పెంపకం నకు సంబంధించిన ప్రేరిత, ప్రజననం, మరియు వివిధ యాజమాన్య పద్దతులను విద్యార్థులకు విపులంగా ఫామ్ యజమాని ఎమ్.డి.మజీద్ వివరించడం జరిగింది.

జంతుశాస్త్ర విభాగాధిపతి శ్రీనాథ్ పటేల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ మోదాల మల్లేష్ , సంతోష్ కుమార్ , సరిత, మహేశ్వరి ఈ పర్యటనలో పాల్గొన్నారు.

NLG: మర్రిగూడ లో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: మండలంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నీలకంఠం రాములు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు జరిగిన ప్రజల వద్దకు పాలన సంక్షేమ కార్యక్రమంలో ప్రజల వద్ద తీసుకున్న దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ వాగ్దానాలు అమలు చేయాలని, పేదలకు 6 గ్యారంటీ లను వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న ప్రభుత్వం, ఆ విధంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు.

అట్లాగే చర్లగూడెం ముంపు బాధితులకు నష్టపరిహారం ఇచ్చి పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, ఉప్పునూతల వెంకటయ్య, మైల సత్తయ్య, గిరి వెంకటయ్య, నీలకంఠ యాదయ్య, ఎడ్ల అంజయ్య, మాడుగుల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో జై భీమ్ నినాదం సృష్టికర్త ఎల్ ఎన్ హరిదాసు జన్మదిన వేడుకలు

నల్గొండ జిల్లా:

కొండమల్లేపల్లి: అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో జై భీమ్ నినాదం సృష్టికర్త ఎల్ ఎన్ హరిదాసు జన్మదిన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న పాల్గొని మాట్లాడుతూ.. మహారాష్ట్ర నాసిక్ లో కాలరామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమ సందర్భంలో, సత్యాగ్రహాన్ని ఉత్తేజ పరచడానికి ఇచ్చిన నినాదం 'జై భీమ్- బల్ భీమ్' అని తెలిపారు. ఎవరైనా మనకు జై భీమ్ చెబితే తిరిగి ప్రతిగా బల్బీమ్ అనాలని, కట్టర్ అంబేద్కర్ వాది సమత సైనికులు నాగపూర్ ప్రధాన కార్యదర్శి 24 సెప్టెంబర్ 1932 న పూనా ఒప్పంద పత్రంలో సంతకం చేసిన ప్రముఖుడు ఎల్ ఎన్ హర్ దాస్ అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నాయకులు అంబేద్కర్, ధర్మపురం శ్రీను, ఎమ్మార్పీఎస్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, జిల్లా రాములు, అందుగుల పరమేష్, ఎల్ల స్వామి, యాకోబు, తదితరులు పాల్గొన్నారు

TS: తెలంగాణలో MLA కోటా MLC ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను విడుదల చేసింది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు శాసన సభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 18వ తేదీన నామినేషన్ల గడువు ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇస్తారు. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

YBD: ప్రజా పాలన ద్వారా సంక్షేమ పథకాలను పేదలకు: మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

యాదాద్రి జిల్లా:

చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని

17,18 వార్డులో ప్రజా పాలన అభయహస్తం 06 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన ప్రవేశ పెట్టడం జరిగింది. దరఖాస్తుల స్వీకరణ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాలు అందరికీ చెందుతాయని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె అభివృద్ధి జరుగుతుంది అని నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారం ప్రజల వద్దకు రావడం జరిగినది అన్నారు.

మహాలక్ష్మీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత కరెంట్, 500 రూ.ల గ్యాస్, గృహ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ప్రతి పేద కుటుంబం బాగుపడుతుంది అని అన్నారు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ధనుంజయ, కౌన్సిలర్ గోపగొని లక్ష్మణ్, కామిశెట్టి శైలజ భాస్కర్, నాయకులు పెద్దగొని రమేష్, వీరమల్ల సతయ్య, తడక అమర్, రహీమ్, చప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఆరిఫ్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Viral video: కోర్టు లైవ్ లో మహిళా జడ్జి పై దాడి
కోర్టు లైవ్ లో మహిళా జడ్జి పై దాడి.. అమెరికాలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా ముద్దాయి రెచ్చిపోయాడు. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని ఏకంగా మహిళా జడ్జి పై దాడికి దిగాడు. తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టులోనే జడ్జి పైకి అమాంతం దూకి దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని పక్కకు లాగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కోర్టు లైవ్ లో మహిళా జడ్జి పై దాడి.. అమెరికాలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా ముద్దాయి రెచ్చిపోయాడు. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని ఏకంగా మహిళా జడ్జి పై దాడికి దిగాడు. తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టులోన