నల్లగొండ: ప్రజా సమస్యల పరిష్కారమే ఏ జండగా పనిచేస్తాం: సిపిఎం పార్టీ
ప్రజా సమస్యల పరిష్కారమే ఏ జండగా పనిచేస్తాం
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీని విస్తరించాలి
కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదని ప్రజా సమస్యల పరిష్కారమే ఏజండగా ముందుకు వెళ్లాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు
గురువారం రాత్రి నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు కతాలగుడెంలో సిపిఎం 11వ వార్డు శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన అంతరించి ప్రజా పాలన ప్రారంభం కావడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఐదు అమలు చేయడానికి తీసుకుంటున్న దరఖాస్తులు విచారణల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే అర్హులందరికీ అమలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆధార్ కార్డు ప్రాతిపదికన నగదు చెల్లింపు వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఉపాధి కూలీలు పనికి అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసి పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలని కోరారు.
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు డ్రా ద్వారా ఎంపిక చేసి అర్హులను గుర్తించారని వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు స్వాధీనపరచాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, కతాల గూడెం లోని స్మశాన వాటిక లో మౌలిక వసతులు కల్పించి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. సాగర్ రోడ్ నుండి కొత్తపెల్లి కాల్వ వరకు నాలుగో వరుసల రోడ్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ,కతాలగూడెం నుండి మామిల్లగూడెం మీదుగా గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వరకు రెండు వరుసల తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాలనీలలో అంతర్గత సిసి రోడ్లు నిర్మాణం చేసి డ్రైనేజీ నిర్మించకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. వార్డు విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంచాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ, 11వ వార్డు శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య,శాఖ సభ్యులు దండెంపల్లి మారయ్య, యాదయ్య ,పల్లె నగేష్, కృష్ణ, చంద్రబాబు, జానమ్మ,తదితరులు పాల్గొన్నారు
Jan 07 2024, 10:32