/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు.... Miryala Kiran Kumar
భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు....

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కొత్తగా 761 కరోనా కేసులు, 12 మంది మృతి

దేశంలో 4,334 కరోనా యాక్టివ్‌ కేసులు

కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు మృతి

కరోనాతో మహారాష్ట్రలో ఇద్దరు, యూపీలో ఒకరు మృతి

నల్లగొండ: హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా ( సయ్యద్ సాబ్ ) వారి ఉర్సు ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉత్సవ కమిటీ అధ్యక్షులు కట్టెల శివకుమార్

నల్లగొండ: హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా ( సయ్యద్ సాబ్ ) వారి ఉర్సు ఉత్సవాలు సందర్భంగా నేడు సాయంత్రం 6 గంటలకు స్థానిక తాలూదారి మజీద్ పాత కలెక్టరేట్ నల్గొండ నుండి గంధం భక్తి శ్రద్ధలతో ఉరుసు ఉత్సవాల కమిటీ అధ్యక్షులు అయిన గౌరవ శ్రీ కట్టెల శివకుమార్ గారి ఆధ్వర్యంలో గంధం ప్రారంభించబడి,ఊరేగింపు మునుగోడు రోడ్డు ఈద్గా దర్గా సయ్యద్ షావలి దర్గాకి రాత్రి 8 గంటలకు చేరుకుంది.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉర్స్ కమిటీ అధ్యక్షులు కట్టెల శివకుమార్ మూలాన రెహమాన్ గారు 

మతవల్లి షేక్ అహ్మద్ హబీబ్ బ్రదర్స్ అడ్వకేట్ మస్యుద్దిన్ ఎక్స్ కౌన్సిలర్ ఇంతియాజు ఎక్స్ కౌన్సిలర్ అబ్రార్ షేక్ అజాజ్ కాజా ఫరీద్ అల్లం పల్లీ కొండన్న ఇరిగి బిక్షం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ 

గంటా సుమన్ దుర్గారాజు కుడతాల నాగరాజ్ బీసీ సంఘం నాయకులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చర్ల:ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్

ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్

ఆరు గ్యారంటీల పేరుతో నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తక్షణమే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్ పిలుపునిచ్చారు.

ప్రజా పాలన పేరుతో అధికారులు గ్రామాలలో ప్రజల నుండి దరఖాస్తు స్వీకరిస్తున్నారని స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమయం తీసుకోకుండా వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే పేరుతో అనేక సమస్యలను సర్వేలు చేసి ఒక సమస్యను కూడా పరిష్కరించలేదని ఈ ప్రభుత్వం కూడా వారి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని లేనిచో ప్రజా ఆందోళన చేయవలసి వస్తుందని వారు అన్నారు ఎలాంటి తారతమ్య బాధలు లేకుండా ప్రజలందరికీ ప్రజా పథకాలు అందే విధంగా చూడాలని వారన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా ఇల్లు రేషన్ కార్డు భూమి లేకుండా అనేకమంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఈ ప్రభుత్వం అయినా ప్రజా పాలన పేరుతో తీసుకున్న ప్రతి దరఖాస్తు ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అలాగే ప్రతివారం ఇలా ప్రజా దర్బార్ పేరుతో ప్రజాపాలన నిర్వహించాలని వారు కోరారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కేసులో ఉన్న వాళ్లే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని ఆ ఆప్షన్ ని తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం పేరు అని పెడితే బాగుంటుందని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిరి నరేష్ కనితి భాను ప్రకాష్ బుర్ర సమ్మక్క అలవాల రమణ  తులసి రాణి దుర్గమ్మ రాజమ్మ రమేష్ రాజు రవి కార్తీక్ సుబ్బులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి పేదలకు పంచాలి:కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి

కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి పేదలకు పంచాలి

        - కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి

     

       సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో గల కుడకుడ శివారు ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 126, 110 ,160 లు మొత్తం కూడా కబ్జా గురైందని,ఈ భూమిని కబ్జాల నుండి వెలికి తీసి పేదలకు పంచాలని సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అదనపు(రెవెన్యూ) కలెక్టర్ వెంకట్ రెడ్డి గారికి వినతిపత్రం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ సమీపంలో గల కుడకుడ శివారులో సర్వేనెంబర్ 126 లో సుమారు 85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమి మొత్తం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు మరియు కొంతమంది స్థానిక నాయకులు కలిసి కబ్జా చేసి తప్పుడు దారుల్లో కొంతమంది పట్టాలు సంపాదించారని విమర్శించారు. అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుంచి మా పార్టీ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలేస్తే టీఆర్ఎస్ నాయకులు మరియు నిత్యం పేద ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పుకునే ఒక ఎర్రజెండా పార్టీ నాయకులు కలిసి మా మహిళలపై దాడులు చేశారని అన్నారు. ఆ ఇంటి స్థలాలను నేడు వారు, టిఆర్ఎస్ నాయకులు కలిసి ఆక్రమించుకొని దొడ్డి దారిలో పట్టాల పొందారు,మరికొందరు స్వతంత్ర సమర యోధుల పేరుతోటి, ఎక్స్ మిల్ట్రీ వాళ్ళ పేరుతోటి తప్పుడు దారుల్లో గుట్టలను పట్టా చేయించుకొని, వాటిని నేడు ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నారు.అదేవిధంగా ఉపేందర్ అనే అతను మునిసిపాలిటీలో పనిచేస్తూ అధికార పార్టీ నాయకుల అండదండ తోటి 126 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని అక్కడ ఉన్న పేదలకు అమ్ముతున్నాడు. ఈ కబ్జాదారులను కట్టడి చేయక పోతే ప్రభుత్వ భూమి మొత్తం చివరికి ప్రభుత్వానికి పేద ప్రజలకు లేకుండా పోతుంది అన్నారు. కాబట్టి కబ్జాదారులను శిక్షించి,కబ్జా భూములను వెలికితీసి అర్హులైన పేదలందరికీ 126 గజాల ఇంటి స్థలం ఇచ్చి, ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని మా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఇదే విషయం గతంలో ఉన్న కలెక్టర్ గారికి , చివ్వెంల ఎమ్మార్వో గారికి, పోలీసు వారికి,గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి మా పార్టీ ద్వారా అనేకసార్లు తెలియజేశాము అయినా ఎలాంటి స్పందన లేకపోగ,మాపై తప్పుడు కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్ గారు స్పందించి వారం రోజుల్లో కబ్జా భూమిని వెలికి తీసి, కబ్జాదారులను శిక్షించి ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని, లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాంజీ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు సయ్యద్ హుస్సేన్,పివైఎల్ నాయకులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

నేడు కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిల...

ఢిల్లీ: నేడు కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) విలీనం.. ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్న వైఎస్‌ షర్మిల.. ఈరోజే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న షర్మిల

ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం.. ఉదయం 11 గంటలకు విస్తృత సమావేశం. రానున్న లోక్ సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ “భారత్ న్యాయ యాత్ర” పై సమాలోచనలు..

సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం...

 కవి ,రచయిత్రి, సంఘసంస్కర్త అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు బీసీ సంక్షేమ సంఘం మహిళ ఉద్యోగ యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 

నల్లగొండ గడియారం సర్కిల్లో అమరవీరుల స్థూపం వద్ద సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

 ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ,

 శ్రీమతి సావిత్రిబాయి పూలే మహిళల కోసం1848 సంవత్సరంలో ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి ,

వారికి విద్య బోధన చేసిందని

 అదేవిధంగా అసహయులకు ఆసరా కల్పించిందని,

 తన జీవితం మొత్తం మహిళల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిందని గుర్తు చేశారు.

 ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి ,జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సింగం లక్ష్మి, సెక్రెటరీ చింతపల్లి సదాలక్ష్మి, శంకరదుర్గ, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ ,

యువజన సంఘం అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్,

 కే పర్వతాలు, గుండు వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, పందుల సైదులు గౌడ్, బత్తుల శ్రీనివాస్ ,ఊట్కూరి గిరి, కారింగు లలిత, వల కీర్తి శ్రీనివాస్, మల్లెబోయిన సతీష్ యాదవ్, కొప్పు యాదయ్య గౌడ్, కొప్పు మహేష్ గౌడ్, పగిళ్ల కృష్ణ ,గడ్డం దశరథ కొద్దిగా సుమలత స్వాతి తదితరులు పాల్గొన్నారు.

టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ గా పాపని వనజ

టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ గా పాపని వనజ 

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన బిజెపి మహిళా మోర్చా జిల్లా నాయకురాలు పాపని వనజ వాసుదేవ్ టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ శాఖ నుండి ఉత్తర్వులు జారీ చేసింది. గత 30 సంవత్సరాలుగా ఆమె పార్టీలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన పార్టీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పాపని వనజ వాసుదేవ్ మంగళవారం ఒక ప్రకటనలో... తన నియామకానికి సహకరించిన బిజెపి కేంద్ర, రాష్ట్ర, జిల్లా నాయకులతోపాటు స్థానిక నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..

మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఇప్పటికే రెండు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాని కేజ్రీవాల్.. ఓసారి ఎన్నికల ప్రచారం, మరోసారి విపాసన ప్రక్రియ సాకుగా చూపిన ఢిల్లీ సీఎం.. నేటి విచారణకు కూడా హాజరుకావడం లేదని ఈడీకి లేఖ

హైదరాబాద్‌: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు..

హైదరాబాద్‌: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు.. తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన సీనియర్ నేతల సమక్షంలో చర్చలు.. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 5 వందల మంది నేతలకు ఆహ్వానం.. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం..

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచిఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం..

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచిఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,712 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,902 మంది భక్తులు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.97 కోట్లు.