/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG:వేళకు రాని నాన్ స్టాప్ బస్సులు.. క్యూ లైన్లో వేచి ఉన్న ప్రయాణికులు Mane Praveen
NLG:వేళకు రాని నాన్ స్టాప్ బస్సులు.. క్యూ లైన్లో వేచి ఉన్న ప్రయాణికులు

నల్లగొండ: పట్టణంలోని బస్టాండ్ లో హైదరాబాద్ కు వెళ్లే నాన్ స్టాప్ బస్సుల కోసం జనం భారీగా క్యూలైన్లు కట్టారు. దాదాపు ఒక్కొక్క లైన్ లో 60 నుంచి 70 మంది ప్రయాణికులు రెండు క్యూలైన్లలో టికెట్ల కోసం క్యూ కట్టారు. నాన్ స్టాప్ బస్సులు సరిగా అందుబాటులో లేవని సరియైన వేళలలో బస్సులు రావట్లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

ఈ పరిస్థితి ఇంతకుముందు లేదని, గత పది రోజులుగా ఉందని, ఇకనైనా ఆర్టీసీ అధికారులు స్పందించి నాన్ స్టాప్ బస్సులను సరైన వేళలకు నడిపించాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.

AP: నేడు సీఎం జగన్ ను కలవనున్న వైయస్ షర్మిల

అమరావతి: వైఎస్ షర్మిల ఇవాళ సీఎం జగన్‌ను కలవనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిలా రెడ్డి కుటుంబ సభ్యులు గన్నవరం చేరుకొని, సాయంత్రం తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు.

కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ మోహన్ రెడ్డికి షర్మిలా రెడ్డి అందించ నున్నారు.

వైఎస్ షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరి, కుమార్తె, కోడలి తరపు కుటుంబ సభ్యులు కూడా జగన్ వద్దకు వెళ్లనున్నారు.

NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో న్యూ ఇయర్ వేడుకలు

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో నూతన సంవత్సర వేడుకలు కళాశాల ప్రిన్సిపల్ ఘన శ్యామ్ ఆధ్వర్యంలో మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని చేత కేక్ కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యా సంవత్సరం ఇదే అని, విద్యార్థులంతా కళాశాలలో ఉన్న అన్ని సౌకర్యాలను వినియోగించుకొని, మంచి ర్యాంకు లతో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థినులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, దేవవాని, నరేష్, వెంకటకృష్ణ, హసేన, స్వామి, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, ధర్మేందర్, జ్యోతి , మంజుల, యాదగిరి మరియు కళాశాల గ్రంథాలయ అధ్యాపకులు సుంకరి రాజారామ్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం,

లెంకలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో, ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమాన్ని మంగళ వారం గ్రామ సర్పంచ్ పాక నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి అధికారులు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. 

అధికారులు దరఖాస్తులను పరిశీలించి రసీదులు అందజేశారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ వెంకటేశం, ఏపీఎమ్ హరి, పంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి తదితర అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

TS: శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.2.9కోట్ల విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.2.9కోట్ల విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్‌లోని రాజీవ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న

బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.

విమానాల్లో దుబాయి నుంచి వచ్చిన నలుగురి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

TS: సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంత్రులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సెక్రటేరియట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లు అభిమానులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. సీఎం ను కలిసి శుభాకాంక్షలు తెలపడానికి సాధారణ జనం క్యూ లైన్ కట్టారు.

TTD: శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు

తిరుమల: శ్రీవారి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించిన టీటీడీ బోర్డ్.. 2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం 1398 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రతీ నెలా శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్లు దాటి వచ్చినట్లు తెలిపారు. జూలై నెలలో అత్యదికంగా 129 కోట్లు, నవంబర్ నెలలో అత్యల్పంగా 108 కోట్లు ఆదాయం వచ్చిందని, డిసెంబరు నెలలో 116 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.

NLG: నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చందనా దీప్తి

నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా నూతన ఎస్పీగా చందనా దీప్తి, ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వ రావు ఐపీఎస్, CID ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి బదిలీ కాగా.. ఆమె స్థానంలో 2012 బ్యాచ్ కు చెందిన చందనా దీప్తి ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు.

సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ కి అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, యస్.బి డిఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్, నల్లగొండ డిఎస్పీ శ్రీదర్ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, డిసిఆర్బి డిఎస్పీ సైదా, సిఐలు, ఆర్.ఐ లు, ఎస్సైలు, డి.పి.ఓ సిబ్బంది స్వాగతం పలికారు.

TS: రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మలిదశ ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, తెలంగాణ ఉద్యమ నాయకులకు... తెలంగాణ మలిదశ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్, నూతన సంవత్సరం 2024 శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాలని కోరుకున్నట్లు తెలిపారు.

HYD: ఈరోజే నాంపల్లిలో ఎగ్జిబిషన్ ప్రారంభం.. 2,400 స్టాల్లతో వినోదానికి సిద్దం

హైదరాబాద్: నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఏర్పాట్లుకు సర్వం సిద్ధమైంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులపాటు కొనసాగనున్న ఆల్ ఇండి యా,ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు.

ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయి. ఎగ్జిబిషన్‌ ను మొత్తంగా 22 లక్షల మంది సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

గాంధీభవన్, గోషామహల్, అజంతా వైపు గేట్లు ఏర్పాటు చేశారు. టికెట్ ధరను 40 రూపాయలుగా నిర్ణయించారు. సందర్శకులకు వినోదాన్ని పంచేందుకు క్రీడాపోటీల తోపాటు వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేయనున్నారు...