NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో న్యూ ఇయర్ వేడుకలు
నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో నూతన సంవత్సర వేడుకలు కళాశాల ప్రిన్సిపల్ ఘన శ్యామ్ ఆధ్వర్యంలో మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని చేత కేక్ కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యా సంవత్సరం ఇదే అని, విద్యార్థులంతా కళాశాలలో ఉన్న అన్ని సౌకర్యాలను వినియోగించుకొని, మంచి ర్యాంకు లతో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థినులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, దేవవాని, నరేష్, వెంకటకృష్ణ, హసేన, స్వామి, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, ధర్మేందర్, జ్యోతి , మంజుల, యాదగిరి మరియు కళాశాల గ్రంథాలయ అధ్యాపకులు సుంకరి రాజారామ్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
Jan 03 2024, 11:20