/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి Mane Praveen
TS: సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంత్రులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సెక్రటేరియట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లు అభిమానులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. సీఎం ను కలిసి శుభాకాంక్షలు తెలపడానికి సాధారణ జనం క్యూ లైన్ కట్టారు.

TTD: శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు

తిరుమల: శ్రీవారి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించిన టీటీడీ బోర్డ్.. 2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం 1398 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రతీ నెలా శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్లు దాటి వచ్చినట్లు తెలిపారు. జూలై నెలలో అత్యదికంగా 129 కోట్లు, నవంబర్ నెలలో అత్యల్పంగా 108 కోట్లు ఆదాయం వచ్చిందని, డిసెంబరు నెలలో 116 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.

NLG: నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చందనా దీప్తి

నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా నూతన ఎస్పీగా చందనా దీప్తి, ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వ రావు ఐపీఎస్, CID ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి బదిలీ కాగా.. ఆమె స్థానంలో 2012 బ్యాచ్ కు చెందిన చందనా దీప్తి ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు.

సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ కి అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, యస్.బి డిఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్, నల్లగొండ డిఎస్పీ శ్రీదర్ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, డిసిఆర్బి డిఎస్పీ సైదా, సిఐలు, ఆర్.ఐ లు, ఎస్సైలు, డి.పి.ఓ సిబ్బంది స్వాగతం పలికారు.

TS: రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మలిదశ ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, తెలంగాణ ఉద్యమ నాయకులకు... తెలంగాణ మలిదశ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్, నూతన సంవత్సరం 2024 శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాలని కోరుకున్నట్లు తెలిపారు.

HYD: ఈరోజే నాంపల్లిలో ఎగ్జిబిషన్ ప్రారంభం.. 2,400 స్టాల్లతో వినోదానికి సిద్దం

హైదరాబాద్: నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఏర్పాట్లుకు సర్వం సిద్ధమైంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులపాటు కొనసాగనున్న ఆల్ ఇండి యా,ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు.

ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయి. ఎగ్జిబిషన్‌ ను మొత్తంగా 22 లక్షల మంది సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

గాంధీభవన్, గోషామహల్, అజంతా వైపు గేట్లు ఏర్పాటు చేశారు. టికెట్ ధరను 40 రూపాయలుగా నిర్ణయించారు. సందర్శకులకు వినోదాన్ని పంచేందుకు క్రీడాపోటీల తోపాటు వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేయనున్నారు...

చందంపేట పిఎసిఎస్ ఛైర్మెన్ నరసింహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ చిత్రపటం బహుకరణ

నల్లగొండ జిల్లా:

చందంపేట: ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్, పిఎసిఎస్ చందంపేట మండలం సహకార సంఘం చైర్మన్ జాల నరసింహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న బుర్రి వెంకన్న మరియు ప్రజా సంఘాల జేఏసీ నాయకులు కంబాలపల్లి వెంకటయ్య లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఆయనకు బహుకరణ చేశారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పించిన గొప్ప మహానుభావుడని ఆయన సేవలను మరువలేమని ఆయన చిత్రపటాన్ని బహుకరణ చేసినందుకు అభినందించారు.

లెంకలపల్లి: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ పాక నగేష్

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: లెంకలపల్లి గ్రామ ప్రజలకు సర్పంచ్ పాక నగేష్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం 2024 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కొత్త సంవత్సరం అందరి జీవితాలలో వెలుగులు వెదజల్లాలని కోరుతున్నట్లు తెలిపారు.

ISRO: కొత్త ఏడాది తొలిరోజే ప్రయోగం.. పీఎస్‌ఎల్‌వీ-సీ58 కౌంట్‌డౌన్‌ షురూ

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 2024 కొత్త ఏడాది తొలి రోజే పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేసింది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం(ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది..

ఇందుకు సంబంధించి సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ (శ్రీహరికోట)లో కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్‌4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనుంది..

ఎక్స్‌పోశాట్‌ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుంది. ఇమేజింగ్‌, టైం-డొమైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్‌ లక్ష్యం. ఈ ఉపగ్రహ జీవితకాలం అయిదేళ్లు. పీఎస్‌ఎల్‌వీ చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది. దీనికి పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌(పీవోఈఎం) అని నామకరణం చేశారు.

TS: జిల్లా కోర్టు జడ్జి గా ఎంపికైన ఏపిపి శ్రీనయ్య

నల్లగొండ జిల్లా:

కొండమల్లేపల్లి మండలంలోని కొలుముంతల పహాడ్ గ్రామానికి చెందిన వస్కుల నర్సింహ- సత్తెమ్మ దంపతులకు కుమారుడు శ్రీనయ్య తెలంగాణ రాష్ట్ర జిల్లా కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2012 నుండి 2023 వరకు ఆయన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహించారు. ఇటీవల వెలువడిన ఫలితాలలో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కొమ్ము రాజశేఖర్, తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

TS: నల్లగొండ జిల్లా ఎస్పీగా చందనా దీప్తి.. ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ.. నల్లగొండ జిల్లా ఎస్పీగా ఐపీఎస్ అధికారి చందనా దీప్తిని నియమించింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఐపిఎస్ అధికారి అపూర్వరావు ను ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, సిఐడి విభాగానికి ఎస్పీగా బదిలీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.