కొండమల్లేపల్లి: ఘనంగా ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం
నల్లగొండ జిల్లా:
ఎస్ఎఫ్ఐ, దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, నేడు కొండమల్లేపల్లి లో SFI 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా SFI పతాకాన్ని డివిజన్ అధ్యక్షులు రామావత్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థి పోరాటాలకు దిక్సూచి అయిన SFI , 1970 డిసెంబర్ 30,31 తేదీలలో కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం పట్టణంలో ఆవిర్భవించి, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.
స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో గత 54 సంవత్సరాలుగా విద్యార్థులను, ప్రజలను చైతన్య పరుస్తూ భగత్ సింగ్, సావిత్రి బాయి, అంబేద్కర్ లాంటి మహనీయుల స్పూర్తితో సమసమాజన స్థాపనకై కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే విద్య వ్యతిరేక విధానాలపై నిరంతరం మిలిటెంట్ పోరాటాల నిర్వహిస్తూ, ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడని ఏకైక విద్యార్థి సంఘం SFI అని అన్నారు. అలాగే దేశంలో అత్యధిక మెంబర్షిప్ కలిగిన సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు.
అదేవిదంగా కొఠారి కమిషన్ ప్రకారం విద్యపై కేంద్ర ప్రభుత్వం 10% నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 30% కేటాయించాలని పేర్కొన్నా, పాలక ప్రభుత్వాలు విద్యను విస్మరించడం దారుణమని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికి విద్యను కొనుక్కునే పరిస్థితిలొనే ఉండటం దారుణం అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేరుతో కార్పొరేట్ వారికి లాభం చేకూరేలా చేస్తూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర చేస్తుదన్నారు. ఈ నూతన జాతీయ విద్యావిధాన రద్దుకై మేధావులు, విద్యార్థులను కలుపుకొని SFI పోరాటాలు కొనసాగిస్తుందని తెలియచేసారు.
అలాగే మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరుబాట చేయాలని, అమ్మాయిలను పుట్టనిద్దాం - చదవనిద్దాం -ఎదగానిద్దాం కాపాడుకుందాం అనే నినాదాలను ముందుకు తీసుకపోవాలని సూచించారు. అందరికి విద్య - అందరికి ఉపాధి కల్పనకై కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్, సాయి,రాహుల్, రాజేశ్వరి, అనిత, ఆంజనేయులు, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
Dec 31 2023, 18:31