నేడు అయోధ్యకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ
న్యూ ఢిల్లీ: అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య లో వేల కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు.ప్రధాని మోదీ, ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు.15 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. జనవరి 22న జరిగే విగ్రహా ప్రతిష్ఠాపన కు సర్వం సిద్దమవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా, ఇవాళ అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11గంటల 15 నిమిషాలకు అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్, మధ్యాహ్నం 12గంటల15 నిమిషాలకు ఎయిర్‌పోర్ట్ ను ప్రారంభించనున్నారు.
ఒంటి గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచే సుమారు 15వేల 700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోయింది.
Dec 30 2023, 11:38