పదవులు ఎవరికి శాశ్వతం కాదు అభివృద్ది ఎంత చేశామనేదే ముఖ్యం పదవి ఎదైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి గ్రామాల అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృ
పదవులు ఎవరికి శాశ్వతం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజక వర్గం పెన్ పహాడ్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం లో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంల పాల్గొన్న జగదీష్ రెడ్డి పశువైద్య, ఉధ్యానవన, నీటి పారుదల, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖ, ప్రాధమిక విద్య, పౌర సరఫరా, ఆరోగ్య, రోడ్లు రహదారులు తో పాటు పలు శాఖల ఆధ్వర్యంలో లో జరిగిన, జరుగుతున్న , జరుగాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ పదవులు ఎవరికి శాశ్వతం కాదని అధికారంలో మనం ఎంత అభివృద్ది చేశామో ముఖ్యమని ఆయన అన్నారు. బిఆర్ఎస్ అధికారం రాకముందు పల్లెలు, పట్టణాలు ఎలా ఉన్నాయో బిఆర్ఎస్ హయాంలో ఎంత అభివృద్ది జరిగిందో అధికారులే సాక్షమని అన్నారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలి అన్నారు. మీరు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు భవిష్యత్తు తరాలకు చిహ్నం గానిలబడాలని సూచించారు.గ్రామాల అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నారు.బిఆర్ఎస్ పాలనలో పార్టీలకతీతంగా అభివృద్ధి జరిగిందన్నారు.
అదే తరహా పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఆశిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో జరగవలసిన పనులపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి అభివృద్ది కొనసాగించేందుకు పూర్తిగా మద్దతు తెలుపుతామని, అవసరమైతే పోరాటాలకు కూడా సిద్దమని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేపడితే తమకు పోరాటాలు కొత్తేమీ కాదని తన ఎనిమిదవ తరగతి నుండి పోరాటాలు చేస్తున్నామని గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి భాగస్వామ్యం కావాలని సర్పంచులకు సూచించారు. కెసిఆర్ ఏ విధంగా రాష్ట్రం అభివృద్ది చేయాలని చిత్తశుద్ధితో పనిచేశారో సర్పంచులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు వార్డుల అభివృద్ధికి కృషి చేయాలి అని కోరారు ఎంపీపీ నెమ్మాధి బిక్షం ఆధ్వర్యంలో లో జరిగిన సమావేశంలో జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, వైస్ ఎంపీపీ సింగా రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి, వెన్న సీతారాం రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.
Dec 23 2023, 19:29