/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఎన్జీ కళాశాలలో నేషనల్ మ్యాథమేటిక్స్ డే సెలబ్రేషన్స్ Mane Praveen
NLG: ఎన్జీ కళాశాలలో నేషనల్ మ్యాథమేటిక్స్ డే సెలబ్రేషన్స్

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ 136వ జయంతి వేడుక ను కళాశాల గణిత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఉపేందర్ తెలిపారు. 

ఈ సందర్భంగా గణిత శాస్త్ర విభాగాధిపతి నక్క నరసింహ మాట్లాడుతూ.. శ్రీనివాస్ రామానుజన్ తమిళనాడులో పుట్టి, అతి పేద స్థాయి నుంచి వారు భారతదేశం గర్వపడేలా గణిత మేధావిగా ఎంతో కృషి చేశారని, తన జయంతి ని భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 రోజున నిర్వహించుకుంటున్నామని, వారు గణితశాస్త్రంలో ముఖ్యంగా సంఖ్యా శాస్త్రము, గణిత విశ్లేషణ, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేష కృషి చేశారని, ముఖ్యంగా రామానుజన్ నంబర్ 1729 ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని, ప్రస్తుతం మానవ సమాజంలో గణితం యొక్క ప్రాధాన్యత ఎంతో ఉందని అదేవిధంగా పోటీ పరీక్షల్లో కూడా వీటి పైన ప్రత్యేకంగా ప్రశ్నలు వస్తాయని వారు చేసినటువంటి గణిత శాస్త్ర అభివృద్ధికి చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని, కంపిటేషనల్ మ్యాథమెటిక్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇంకా ఎన్నో పరిశోధనలు కొనసాగించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సయ్యద్ మునీర్, అధ్యాపకులు యాదగిరి రెడ్డి, దీపిక , జ్యోత్స్న, దుర్గాప్రసాద్, మధుకర్, కనకయ్య, రజిని, బాల, సిద్దేశ్ ,వెంకటేష్, కృష్ణ, సరిత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: ఢిల్లీ లో జరిగే ఎన్ఎస్ఎస్ రిపబ్లిక్ డే పరేడ్ కు ఎన్నికైన నల్లగొండ విద్యార్థిని

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎన్ఎస్ఎస్ యూనిట్- 3 వాలంటీర్ అయిన షేక్ షేన్ను రిపబ్లిక్ డే పరేడ్ కు ఎంపికైంది. జనవరి 1 నుండి 31 వరకు ఢిల్లీ లో జరిగే ఎన్ఎస్ఎస్ రిపబ్లిక్ డే పరేడ్ లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా విద్యార్థిని షేన్ను ను ప్రిన్సిపాల్ ఘన శ్యామ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జ్యోతి, లైబ్రేరియన్ రాజారాం, సిబ్బంది నరేష్, శైలజ, వనజ, సరిత అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Mane Praveen

నల్లగొండ జిల్లా : మునుగోడు మండలం, చీకటి మామిడి గ్రామంలో స్వచ్చందంగా బెల్టుషాపులు మూసి వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్థులు. గ్రామాల్లో బెల్టుషాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారన

NLG: చీకటి మామిడి గ్రామంలో బెల్ట్ షాపులు మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్తులు
నల్లగొండ జిల్లా : మునుగోడు మండలం, చీకటి మామిడి గ్రామంలో స్వచ్చందంగా బెల్టుషాపులు మూసి వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్థులు. గ్రామాల్లో బెల్టుషాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని మహిళల ఆవేదన. •:బెల్టుషాపుల నియంత్రణపై ప్రభుత్వ నిర్ణయానికి ముందే కృషి చేసిన *మునుగోడు శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు. • గ్రామంలో బెల్ట్ షాపులు స్వచ్ఛందగా నిలిపివేత పై హర్షం వ్యక్తం చేస్తూ మహిళల ర్యాలీ.
NLG: మృత కుటుంబానికి పగడాల ముత్తు అండ.. పదివేలు ఆర్థిక సహాయం

నల్లగొండ జిల్లా,మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన తుప్పరి మహాలక్ష్మి (అమ్ములు) (14) తీవ్రమైన డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచింది. ఆ చిన్నారి మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎదిగిన కూతురి మరణం గ్రామ ప్రజల చేత కూడా కంటతడి పెట్టించింది. తండ్రి తుప్పరి సత్తయ్య వికలాంగుడు కావడంతో ఆర్థిక సమస్యలు ఉన్నట్లు సహచరుల ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు.. బాధిత కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించుటకు గాను రూ. 10,000/- పదివేలు మృతురాలి తండ్రికి అందించారు. భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉన్నా తనను సంప్రదించాలని కోరారు. దిక్కు తోచని వారి కుటుంబానికి బాసటగా నిలిచిన పగడాల ముత్తు కు ఆ గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. ఫౌండేషన్ వైస్ ఛైర్మెన్ మాడ్గుల శిరీష, ట్రెజరీ పగడాల కళ్యాణ్, మొగిలి కిషన్, ఉప సర్పంచ్ శ్రీను, పాపయ్య, జాల గణేష్, తదితరులు ఉన్నారు.

TS: ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి తో పాల్గొన్న గున్న రాజేందర్ రెడ్డి

ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి తో పాల్గొన్న గున్న రాజేందర్ రెడ్డి

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ  

సంస్థలకు దక్కిన గొప్ప గౌరవం అని తెలిపిన

 సంస్థల రాష్ట్ర క్రీడల ప్రధాన కార్యదర్శి

బొమ్మపాల గిరిబాబు

తెలంగాణ పర్యటనలో భాగంగా నిన్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము తో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి సతి సమేతంగా ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని రాష్ట్రపతితో పంచుకునే అరుదైన గౌరవం లభించడం ఎంతో గొప్ప విషయమని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల రాష్ట్ర క్రీడల కార్యదర్శి బొమ్మపాల

గిరిబాబు తెలిపారు. 

గత కొన్ని దశాబ్దాలుగా గాంధీ గ్లోబల్ సంస్థలు స్వచ్ఛందంగా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నాయని వారు తెలిపారు.

TS: సంద శ్రీదేవికి బిజినెస్ మేనేజ్మెంట్ లో డాక్టరేట్

నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం, ఇనుపాముల గ్రామానికి చెందిన సంద శ్రీదేవి పీహెచ్డీ పట్టా పొందారు. పీజీ లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొ. సంపత్ కుమార్ పర్యవేక్షణలో బిజినెస్ మేనేజ్మెంట్ లో "Barriers to career Advancement for women in IT industres" అనే అంశంలో పరిశోధన గ్రంథాన్ని సమర్పించినందుకు సంద శ్రీదేవికి పీహెచ్డీ అవార్డును ప్రధానం చేశారు.

అంతేకాకుండా సంద శ్రీదేవి తన పీహెచ్డీ పరిశోధనలో భాగంగా.. దుబాయ్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు సంద శ్రీదేవిని అభినందిస్తున్నారు.

ఈ సందర్భంగా సంద శ్రీదేవి మాట్లాడుతూ.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించి, ఉన్నత ఆశయాలను ఏర్పరచుకొని.. లక్ష్యం కోసం అనునిత్యం కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని అన్నారు. తాను రాసిన పరిశోధన గ్రంథాన్ని యుక్త వయసులోనే ప్రమాదంలో చనిపోయిన తన అన్న జ్ఞాపకార్ధంగా సంద నాగార్జున కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

ఒకే కుటుంబంలో ఇద్దరికీ పిహెచ్డి

పేదరికంలో పుట్టి పెరిగిన ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు పిహెచ్డి పట్టా పొందడం విశేషం. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల మారుమూల గ్రామంలోని సంద బాలయ్య, తేరోజమ్మ దంపతుల 5వ కూతురు సంద శ్రీదేవి.. ఆమె అక్క సంద రజిత ను ఆదర్శంగా తీసుకొని పిహెచ్డి పొందారు.

సంద బాలయ్య, తేరోజమ్మ దంపతుల రెండవ కూతురు సంద రజిత 11 సంవత్సరాల క్రితమే ఎర్త్ సైన్స్ లో పిహెచ్డి పట్టా, అదేవిధంగా 6 సంవత్సరాల క్రితం పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ పొందారు. అంతేకాకుండా ఈమె తన పోస్ట్ పిహెచ్డి పరిశోధనలో భాగంగా జపాన్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో ఉపన్యాసించారు.

మారుమూల గ్రామంలో పేదరికంలో పుట్టి పెరిగి ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో చదివిన వారు.. ఉన్నతమైన ఆశయం కోసం, అత్యున్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో, కష్టపడి చదివి పీహెచ్డీ డాక్టరేట్ పురస్కారాన్ని పొందారు. ఈ సందర్భంగా వారు ఉన్నత లక్ష్యాలను చేరాలనుకునే ఎందరో పేదింటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

YBD: ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన నిందితుడు


యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదాద్రి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల తో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మోసం.. వివరాలకు వెళితే...

యాదాద్రి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన వినయ్ కృష్ణ రెడ్డి పేరిట ఆర్డర్ కాపీలను తయారుచేసిన ఆలేటి నవీన్.

నకిలీ ఆర్డర్ కాపీలను కొంతమందికి ఇచ్చిన మోసగాడు.

మోట కొండూరు మండలం వర్టూర్ గ్రామానికి చెందిన నిందితుడు ఆలేటి నవీన్.

తండ్రి ఆలేటి స్వామి వృత్తి రీత్యా అడ్డగుడూర్ ఎంపిడివో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు కొనసాగిస్తున్నాడు.

నిందితుడు పదిమంది భాదితుల నుండి దాదాపు 15 లక్షల నుండి 20లక్షలు వరకు వసూలు చేశాడు.

కలెక్టర్ ఆఫీసులలో అసిస్టెంట్ ఉద్యోగం, విద్యా శాఖలో మూడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన నిందితుడు నవీన్.

గతంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన టీ.వినయ్ కృష్ణ రెడ్డి మరియు గతంలో పనిచేసిన జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని.. సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఆర్డర్ కాపీని సైతం బాధితులకు ఇచ్చాడు.

తీరా అవి నకిలీవని తెలియడంతో బాధితులు లబోదిబోమంటూ భువనగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించారు.

బాధితుడు పుల్లెల ప్రవీణ్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్న పోలీసులు.

TS: ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణం: సజ్జనార్

తెలంగాణలోని కొన్ని డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లతో ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎం.డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కు మంచి స్పందన వస్తోంది.ఈ పథకాన్ని మహిళలు,బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు.

కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకు రావడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ ఫోన్‌లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపుకార్డు లలో ఏదో ఒకటి ఒరిజినల్ చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరుతున్నట్లు తెలిపారు.

జిరాక్స్ కాపీలు, స్మార్ట్ ఫోన్ల లో ఐడీలు చూపిస్తే ఉచిత ప్రయా ణానికి అనుమతి ఉండదు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటో లు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటో లు ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

TS: కెసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేడు అసెంబ్లీ సమావేశంలో గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాలేశ్వరం అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో తొమ్మిదేళ్లుగా సాగునీటి శాఖ కేసీఆర్ కుటుంబం ఆధీనంలోనే ఉందని, అయినా తెలంగాణకు ఏం చేయలేదని మండిపడ్డారు. కెసిఆర్, కేటీఆర్ లను ఉద్దేశిస్తూ.. మీరు వచ్చాక శివుడి తలపై ఉన్న గంగను భూమి మీదకు తెచ్చి కాళేశ్వరానికి పారించారా? అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.

TS: ఫలించిన వివేక్ వెంకటస్వామి కృషి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుపట్టి విజయం సాధించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఎన్నికలు అయిపోయిన 15 రోజుల్లోనే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సింగరేణిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం జరిగింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీ లను నెరవేర్చడం జరిగింది.