ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను పరిశీలించుకుని ముందుకెళ్తాం
జూలకంటి రంగారెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
శాసనసభ ఎన్నికల్లో సిపిఎం పార్టీ పోటీ చేసిన స్థానాలలో ఓటమికి గల కారణాలను పరిశీలించుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని *సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు,
శుక్రవారం రోజున సిపిఎం జిల్లా కమిటీ, సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నజూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రెండు ప్రధానమైన పార్టీల మధ్య పోటీగా చూశారని టీఆర్ఎస్ ఓడిపోవాలంటే కాంగ్రెస్ కు ఓట్లు వేశారని తెలిపారు. కాంగ్రెస్ రావద్దు అనేవారు టిఆర్ఎస్ కు టిఆర్ఎస్ రావద్దు అనేవారు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని మూడవ పార్టీ వైపు ఓటర్సు చూడలేదని ఓటు వేయాలని ఆలోచించలేదని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సక్రమంగా అమలు చేయకపోవడం, కారణమని అన్నారు .మరియు దళిత బంధు, బీసీ బందు, మైనారిటీ బందు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకా పోవడం వలనే, టిఆర్ఎస్ ను ఓడించారని మరియు నిరంకుశ ప్రజాస్వామిక పోకడలు కుటుంబ పాలన నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రజలు నమ్మారని అన్నారు. అవినీతి అక్రమాలు మరియు స్థానిక ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత అందర్నీ కలుపుకొని పోకపోవడం వలన, టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ వ్యతిరేకత మరియు ఆరు పథకాలు ప్రజల ముందు పెట్టడం ప్రజలు వాటిని నమ్మడం అందరూ కలిసి పనిచేయడం వలన గెలిచిందని, తెలిపారు.సిపిఎం పోటీ చేసిన నియోజకవర్గాలలో ఓట్లు నిలబెట్టుకోలేక పోయామని ఒంటరిగా గెలవలేరని మెజారిటీ, శ్రేణులు కాంగ్రెస్కు ఓటు వేసినారని, అన్నారు టిఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో సిపిఎం శ్రేణులు కాంగ్రెస్కు ఓట్లు వేశారని అన్నారు ఇలాంటి పరిస్థితులను ఎక్కడ పొరపాటు చేసినాము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అలాగే పార్టీ నిర్మాణం సరి దిద్దుకోవటం ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని రానున్న స్థానిక సంస్థలఎన్నికలు ఎదుర్కోవడానికి ఇప్పటినుండే సిద్ధం కావాలని తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆశిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ,రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, డబ్బికారు మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున. బండ శ్రీశైలం, కందాల ప్రమీల,సయ్యద్ హష0, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Dec 09 2023, 11:57