/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. Mane Praveen
TS: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఉద్యమ సమయంలో 2009 డిసెంబర్ 12 నుండి 2014 జూన్ 2 వరకు వివిధ కేసుల్లో అరెస్టయి, జైలుకెళ్లిన ఉద్యమకారుల వివరాలను ఇవ్వాలని తెలంగాణ డిజిపి మరియు వివిధ జిల్లాల ఎస్పీ లను ఆదేశించారు. ఆ వివరాలను బట్టి ప్రభుత్వం త్వరలో ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయనుంది.

NLG: ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థిని కోమల ను అభినందించిన కళాశాలల జాయింట్ డైరెక్టర్

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బి. కోమల ద్వితీయ సంవత్సర విద్యార్థిని, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో భాగంగా.. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి యోగాలో ఎంపికై అన్నా యూనివర్సిటీ, చెన్నై లో పాల్గొని తిరిగి రావడం జరిగింది. ఈ సందర్భంగా Collegiate of Education జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాదగిరి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కడ ఆమె విజయం సాధించకపోయినప్పటికీ ఎం.జి యూనివర్సిటీ తరఫున ఎంపిక కాబడి పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్, ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రాజారామ్, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, నరేష్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన 10k రన్ లో విజేతలుగా ఎన్జీ కళాశాల విద్యార్థులు

నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, వి.ధనుష్ ఎం.ముఖేష్, ఈ రోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అంతర కళాశాలల ఛాంపియన్‌షిప్ 10k రన్ లో పాల్గొని బహుమతి గెలుచుకున్నారు. అదేవిధంగా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌ కు ఎంపికయ్యారని ఎన్జీ కళాశాల పిడి కడారి మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి, ప్రిన్సిపాల్ ఉపేందర్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు.

TS: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మర్రిగూడ ఏపీవో

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండల ఉపాధి హామీ పథకం ఏపీవో గుంటుక వెంకటేశం శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని హైదరాబాదులో మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో పోగుల ప్రకాష్, కోరే యాదగిరి, బోయ రాంరెడ్డి రెడ్డి, ఇండ్ల నాగరాజు, కొడిదల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

TS: ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహించిన సీఎం రేవంత్

హైదరాబాద్: ఈరోజు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో నిర్వహించిన ప్రజాదర్బార్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.

ఒక్కొక్కరిని కలుస్తూ సమస్యలు వింటూ.. విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నుండి భారీగా సామాన్య ప్రజానీకం వచ్చి తమ వినతులు అందజేశారు. తమ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయని ప్రజలు ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.

TS: ఎల్లుండి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి శ్రీధర్ బాబు

TS: డిసెంబర్ 9 నుండి మహిళలకు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అదేవిధంగా ఎల్లుండి నుండి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పది లక్షల వరకు అమల్లోకి వస్తున్నట్లు తెలిపారు. తమ గవర్నమెంట్ లో ముందుగా ఈ రెండు గ్యారెంటీ లను డిసెంబర్ 9 నుండి అమల్లోకి తెస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అయితే ప్రయాణాలలో మహిళలు తమ ఆధార్ కార్డును చూపించాలని తెలంగాణ పరిధిలో మాత్రమే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో తెలిపారు.

NLG: గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలియజేసారు. పీజి లో 55% మార్కులు ఉన్నవారు అర్హులని ఎస్సీ ఎస్టీలకు 50%. నెట్/సెట్/పి.హెచ్.డి మరియు బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడునని తెలిపారు.

వాణిజ్య శాస్త్రం -01

బి.బి.ఎ (ఈ-కామర్స్) -01

ఆసక్తి కల అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయం లో అందజేయుటకు చివరి తేది ఈనెల 11. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 12న ఉదయం 10.30 గం.లకు కళాశాలలో ఇంటర్వూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

TS: సీఎం రేవంత్ క్యాబినెట్ లో మంత్రులు

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తో నేడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించింది ఇంకా స్పష్టత రాలేదు. అయితే సూత్రప్రాయంగా మంత్రులకు కింద పేర్కొన్నట్లుగా శాఖలు కేటాయించి అవకాశం ఉన్నట్లు పలు మీడియా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

భట్టి విక్రమార్క- రెవెన్యూ

ఉత్తమ్ కుమార్ రెడ్డి - హోం శాఖ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - మున్సిపల్ శాఖ

దామోదర రాజనర్సింహ - ఆరోగ్యశాఖ

శ్రీధర్ బాబు - ఆర్థిక శాఖ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - నీటి పారుదల శాఖ 

కొండా సురేఖ - మహిళా సంక్షేమం

జూపల్లి కృష్ణారావు - పౌర సరఫరాలు

సీతక్క - గిరిజన సంక్షేమం

తుమ్మల నాగేశ్వరావు - రోడ్లు, భవనాలు 

పొన్నం ప్రభాకర్ - బీసీ వెల్ఫేర్

మరికొన్ని మంత్రి పదవులు సీనియర్లకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాతనే మంత్రులకు శాఖలను కేటాయించి అవకాశం ఉన్నట్లు సమాచారం.

TS: తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క

సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారంతో పాటు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మరో 10 మంది మంత్రులు 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణ రావు, పొన్నం ప్రభాకర్, అనసూర్య సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు.

TS: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తొలి సంతకం చేసిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే..

ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల పైన తొలి సంతకం చేశారు. 6 గ్యారంటీ లు ఈ విధంగా ఉన్నాయి

మహాలక్ష్మి పథకం 

పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్.

గృహజ్యోతి 

ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

రైతు భరోసా 

రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్.

యువ వికాసం 

ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు.

చేయూత 

రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000.

ఇందిరమ్మ ఇళ్లు

ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.