NLG: పొత్తు ధర్మాన్ని కాపాడాలి.. రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం.
నల్లగొండ జిల్లా , మునుగోడు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తో సిపిఐ పెట్టుకున్న పొత్తు ధర్మాన్ని ప్రతి కార్యకర్త కాపాడాలని మునుగోడు లో సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సిపిఐ కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని కొరటికల్ గ్రామంలో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. బిజెపికి వ్యతిరేకంగా 27 పార్టీలతో దేశంలో ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు. ఉప ఎన్నికల్లో బిజెపిని అంతమొందించడానికి బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని కానీ ఇప్పుడు రాష్ట్రంలో బిజెపి, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమయ్యాయని, దేశంలో బిజెపిని రాష్ట్రంలో బిఆర్ఎస్ ఓడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. కరుడుగట్టిన కమ్యూనిస్టులు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన చరిత్ర ఈ కొరటికల్ గ్రామానికి చరిత్ర ఉందని అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ 200 దేశాలలో పార్టీ బలంగా ఉందని, మనదేశంలో కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు పరిపాలన చేస్తున్నారని గుర్తు చేశారు. భారతదేశంలో పొత్తు లేకుండా పోటీ చేసే పార్టీలు లేవని అన్నారు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త నికార్సుగా కూలం కుశంగా పనిచేయాలని, ఈ గ్రామంలో భారీ మెజార్టీ దిశగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని సూచించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు సిపిఐ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె మంత్రి అయితాడని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మందుల పాండు, ఆ గ్రామ కార్యదర్శి మునుగోటి దయాకర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దండు లింగస్వామి, సిపిఐ కార్యకర్తలు మిరియాల యాదయ్య, కృపాటి లింగయ్య, రొమ్ముల యాదయ్య, అన్నం వెంకన్న, మందుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Nov 23 2023, 21:38