మునుగోడు నియోజకవర్గం: నరసింహులగూడెం గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ లో చేరిక
మునుగోడు నియోజకవర్గం:
ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నరసింహులగూడెం గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాను కప్పి మాట్లాడారు.
సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలకు అండగా ఉంటున్న ప్రజల ప్రభుత్వం మైన బీఆర్ఎస్ పార్టీని.. ప్రజలందరూ గెలిపించాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ ,రైతుబంధు వంటి పథకాలను అమలు చేస్తూ సబ్బండ వర్గాల సంక్షేమం కొరకు కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం తెలంగాణ లో మాత్రమే అన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపిన మునుగోడు బీఆర్ఎస్ పార్టి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ అధిక మొత్తంలో నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయించి, గ్రామాల్లో నేడు అధిక సంఖ్యలో సిసి రోడ్లు వేయించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ప్రజలందరూ గ్రహించి కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుమ్మాడపు నరసింహారావు, సర్పంచ్ బల్గూరి విష్ణువర్ధన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సభావత్ సర్దార్ నాయక్ నడింపల్లి యాదయ్య బెక్కం రమేష్, బాల్లూరి విజయ్, ఉపసర్పంచ్ బెల్లంకొండ నరసింహా, జాల వెంకటయ్య, బీసు వల్లయ్య, బలుగురి జనార్దన్, కొమ్మానబోయిన యాదయ్య, జెట్టి అంజయ్య, జినుకల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Nov 20 2023, 15:04