సూర్యాపేట ప్రజల ధైర్యం భీఆర్ఎస్
60 ఏళ్ళు నాశనమైన సూర్యాపేటను అభివృద్ధి చేసిన ఘనత భీఆర్ఎస్ పార్టీదే అని రాష్ట్ర మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో విద్యానగర్ పార్టీ కార్యాలయంలో 35 వ వార్డు చర్చి కాంపౌండ్ కు చెందిన కాంగ్రెస్ బిజెపి నేతలు ముకుమ్మడిగా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయ శేఖర్, రాంబాబు, రాజశేఖర్ లతోపాటు 400 మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు గులాబీ తీర్దం పుచ్చుకున్నారు. మంత్రికి మద్దతుగా ఏకగ్రీవంగా తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సూర్యాపేట ప్రజల ధైర్యం భీఆర్ఎస్ పార్టీ అన్నారు. సూర్యాపేటలో అభివృద్ధి కారు స్పీడ్ తో వెళ్తుందన్న మంత్రి, 2014లో కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట ప్రజలను మూసి మురికి నీటి పీడ నుండి విముక్తి కల్పించి, గోదావరి జలాలను తీసుకొచ్చిందన్నారు. గతంలో ఎమ్మెల్యేని కలవాలంటే నే పెద్ద యజ్ఞం చేసే పరిస్థితులు ఉండేవన్నారు. సూర్యాపేట అభివృద్ధి నే ప్రామాణికంగా పని చేసిన నేను ఆనాడు ప్రజలకు చెప్పకున్నా మెడికల్ కళాశాల ను తెచ్చాను అన్నారు.. ఆనాడు కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట కు బోటు తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చింది అన్నారు. సూర్యాపేట లో వ్యాపారులు ధైర్యం గా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారంటే దానికి కారణము ఇక్కడి శాంతి భద్రతలు, ఇక్కడ నెలకొని ఉన్న ప్రశాంత వాతావరణమే అన్నారు. ప్రస్తుతం సూర్యాపేట కు వచ్చిన షాపింగ్ మాల్సే సూర్యాపేట అభివృద్ధికి గీటురాయిగా పేర్కొన్నారు.
మంది ని ముంచడానుకి దొంగలంతా ఒక్కటవుతున్నారన్న మంత్రి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అన్నారు. ఓటు విలువ చాలా గోప్పదన్న మంత్రీ, మన తల రాతను నిర్ణయించేది మనం వేసే ఓటే అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సూర్యాపేటకు లొ పారిశ్రామిక హభ్ ను ఏర్పాటుచేసి పదివేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తానని పేర్కొన్నారు. చెప్పిన హామీలన్నీ నెరవేర్చడంతోపాటు, చేయబోయే కార్యక్రమాలను లిఖితపూర్వకంగా ప్రజల ముందు ఉంచిన ఏకైక పార్టీ దేశంలో బిఆర్ఎస్ మాత్రమే అన్నారు. లిఖితపూర్వకంగా ప్రజలకు హామీ ఇచ్చే ధైర్యం మరే పార్టీకి లేదన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే జరుగుతున్న అభివృద్ధి పనులను కొనసాగించడంతోపాటు, రైతు బీమా తరహాలో 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా, 400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు పెంపు, ఆసరా పెన్షన్లు 5000 రూపాయలు, దివ్యాంగులకు 6000, సౌభాగ్య లక్ష్మి, అన్నపూర్ణ పథకం ద్వారా అందరికీ సన్న బియ్యం, కెసిఆర్ ఆరో ఆరోగ్య రక్ష ద్వారా 15 లక్షల ఆరోగ్య భీమా సదుపాయం, ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి, మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు, అగ్రవర్ణ పేదలకు సైతం గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సబ్బండావర్గాల సంక్షేమమే భీఆర్ఎస్ లక్ష్యం అన్న మంత్రి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Nov 09 2023, 11:43