ఆశీర్వదించండి... సేవకుడిగా పనిచేస్తా
యువత కు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూర్యాపేట లో రాబోయే పాలన ఉండబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి సూర్యాపేట నియోజకవర్గం లో ప్రచార పర్వం తారాస్థాయి కి చేరుకుంది. ప్రత్యర్థులకు అందనంత గా బీఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఈరోజు మొదట గా కుడ కుడ గ్రామం లో అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.. అనంతరం ధి సూర్యాపేట కార్పెంటర్స్ నూతన కార్యవర్గ పదవీ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు సూర్యాపేట ప్రజలకు చెప్పిన హామీలు మొత్తం నెరవేర్చామని అన్నారు. కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చింది అని అన్నారు.
పేట లొ పారిశ్రామికహబ్ నెల కొల్పడమే తన భవిష్యత్ లక్ష్యం ఆన్నారు.ఐటి పరిశ్రమను మూడు వేలకు విస్తరించాలనేదే నా సంకల్పం అన్నారు.కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దన్న మంత్రీ,
కాంగ్రెస్ గెలుపొందడం అంటే.... తోడేళ్ళమంద గొర్రె పిల్లలపై పడటమే అన్నారు. రాష్ట్రం లో ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేది సిఎం కేసిఆర్ లక్ష్యం అనీ,సూర్యాపేట నియోజకవర్గం లొ కూడా ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే నా శపథం అన్నారు.గత మ్యానిఫెస్టోలను నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్ అన్నారు.బీఆర్‌ఎస్ సర్కారు హయాంలోనే మహిళా సంఘాల అభివృద్ధి జరిగిందన్న మంత్రీ పనిచేసే ప్రభుత్వానికి సబ్బండ వర్గాలు అండగా నిలబడాలి అని కోరారు. మరోసారి శాసన సభ్యుడిగా ఆశీర్వదించండి... సేవకుడిగా పనిచేస్తా అన్నారు.
ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టో అద్బుతంగా ఉందన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు సౌభాగ్యలక్ష్మి అందిస్తామని, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవొద్దని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి, కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ , బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఆసరా పెన్షన్ నాలుగువందల మాత్రమె అన్న మంత్రి బీఆర్ఎస్ అధికారం లోకి వస్టే పెన్షన్ 5000 కాబో అన్నారు. గ్యాస్ సిలిండర్ ధర కేవలం 400 కె ఇస్తామని మిగతా బారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. అనంతరం సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.
Nov 09 2023, 08:48