సూర్యాపేట లో కొనసాగుతున్న బీఆర్ఎస్ దూకుడు బీఎస్పీ కి నై.. బీఆర్ఎస్ కే జై అంటున్న గాంధీనగర్ వాసులు
సాధారణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతుంది. సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధితో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేసుకోగా, అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ ,బిజెపి ల నుండి వెల్లువలా కొనసాగుతున్న చేరికలతో బీఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. తాజాగా బీఎస్పీ కి నై అంటూ పట్టణం లోని గాంధీనగర్ , బాషానాయక్ తండా కు చెందిన నేతలు, కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారిలో పురాణపు యాదగిరి, అంజయ్య, ప్రసాద్, రామకృష్ణ, చిన్నరాములు, చిన గురుస్వామి, సాయి కుమార్ తో పాటు 54మంది బిజెపి, కాంగ్రెస్ కార్యర్తలు బీఆర్ఎస్ లో చేరారు.13 వ వార్డ్ అధ్యక్షుడు రఫీ, జానయ్య, జనార్దన్ ఆధ్వర్యం లో చేరికలు జరిగాయి. ఇక చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ లో రౌతు నర్సింహ రావు ఆధ్వర్యం లో 58 మంది కాంగ్రెస్, బిజెపి లకు చెందిన యాదవ సోదరులు, ఇతర పార్టీల కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అభివృద్ధి కి మద్దతుగా పార్టీ లో చేరిన వారందరికీ గులాబీ కండువాకప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరస్వాగతం పలికారు.
Nov 04 2023, 15:31