ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదు
ఆశా వర్కర్లకు 18వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఇతర న్యాయమైన సమస్యల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 15 రోజుల నిరవధిక సమ్మె సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు.
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ జిల్లా విస్తృత సమావేశం సమావేశం జిల్లా అధ్యక్షురాలు డి మహేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ ఆయన ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో ధైర్యంగా ఐక్యంగా వీరోచిత పోరాటం చేసిన ఆశలకు అభినందనలు తెలిపారు. సమ్మెలో భాగంగా 9న చలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ధర్నా సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు గారు ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేందుకు ముగ్గురు ఐఏఎస్ లతో కమిటీ వేస్తామని సమస్యలు సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమ్మె జీతము పెండింగ్ ఏరియర్స్ కరోనా రిస్క్ అలవెన్స్, పెండింగ్ వేతనాలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల కోడ్ వచ్చినందున ఆశ వర్కర్ల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని ప్రభుత్వం మోసం చేస్తే మరో పోరాటానికి ఆశ వర్కర్లు సిద్ధమవుతారని హెచ్చరించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ మాట్లాడుతూ టిబి స్ఫూటం డబ్బాలను ఆశలతో మోపించే పద్ధతి మానుకోవాలని డిమాండ్ చేశారు. పారితోషకాలు లేని పనులను ఆశ వర్కర్లు చేయవద్దని చేయవద్దని అన్నారు. ఆశ వర్కర్ల పనిబారం తగ్గించాలని జాబ్ చార్ట్ రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య,జిల్లా నాయకులు భీమాగాని గణేష్, ఆశ యూనియన్ జిల్లా నాయకులు రమావత్ కవిత, వసంత, శైలు,టీ పార్వతమ్మ, ఎస్ కె సలీమా, కె. సంధ్యారాణి, ఎం పుష్పలత, ఎస్ జయమ్మ, సునీత, పూలమ్మ, బి అనూష, బి.నిర్మల, మమత, పద్మ, శ్వేత, తదితరులు పాల్గొన్నారు
Oct 18 2023, 19:01